Begin typing your search above and press return to search.

పీసీని ఫాలో అవుతోందా?

By:  Tupaki Desk   |   18 April 2019 8:10 AM GMT
పీసీని ఫాలో అవుతోందా?
X
పాశ్చాత్య సంస్కృతి దేశంలో జ‌డ‌లు విప్పి శివ‌తాండ‌వం ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. మెట్రో క‌ల్చ‌ర్ లో ఇది స‌ర్వ‌సాధార‌ణం అయిపోయింది. ర్యాంప్ పై నుంచి వ‌చ్చే టాప్ మోడ‌ల్స్ విదేశీ భామ‌ల్ని అనుక‌రించేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. అట్నుంచి రంగుల ప్ర‌పంచంలోకి ప్ర‌వేశిస్తుంటారు కాబ‌ట్టి ఆ పెనుపోక‌డ‌లు ఇక్క‌డా క‌నిపిస్తుంటాయి. నిన్న‌టికి నిన్న అమెరికా కోడ‌లు ప్రియాంక చోప్రా ఓ అల్ట్రా మోడ్ర‌న్ లుక్ లో క‌నిపించి మైమ‌రిపించింది. డెనిమ్ బాట‌మ్.. వైట్ టాప్- లాంగ్ కోట్ ధ‌రించిన‌ పీసీ నాభికి ఓ రింగును పొడిపించుకుని పాశ్చ‌త్య పోక‌డ‌లో క‌నిపించింది. ఈ త‌ర‌హా హాంకాంగ్.. దుబాయ్ క్యాసినోవా క‌ల్చ‌ర్ లో క‌నిపిస్తుంటుంది.

ప్ర‌స్తుతం ఇంచుమించు అలాంటి పంథాలోనే క‌నిపిస్తోంది ఈ సౌత్ బ్యూటీ. పేరు నిక్కీ తంబోలి. పేరుకు త‌గ్గ‌ట్టే అల్ట్రా మోడ్ర‌న్ స్టైల్లో క‌నిపిస్తున్న ఈ బ్యూటీ మాస్ గుండెల్లోకి బుల్లెట్టులా దూసుకెళ్లింది. ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం వ‌రుస‌గా రెండు మూడు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. అందులో లారెన్స్ మాస్టార్ కాంచ‌న 3 ఈనెల 19న రిలీజ్ కి వ‌స్తోంది. ఈ చిత్రంలో వేదిక‌తో పాటు స్క్రీన్ ని పంచుకుంది నిక్కీ. కాంచ‌న 3లో తంబోలి గ్లామ‌ర‌స్ రొమాంటిక్ ట్రీట్ అంతే మ‌త్తెక్కించ‌బోతోంద‌ని తెలుస్తోంది. నిన్న‌టి సాయంత్రం హైద‌రాబాద్ ద‌స‌ప‌ల్లా ఈవెంట్ లోనూ నిక్కీ తంబోలీ అందాల ఆర‌బోత ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. పాక్షికంగా అందాల్ని ఆవిష్క‌రిస్తూ.. నాభికి మంచి ముత్యాన్ని ధ‌రించి ఈ అమ్మ‌డు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అమెరికా కోడ‌లు పీసీని ఫాలో అవుతోందా? అంటూ సెటైర్లు వినిపించాయి.

అస‌లింత‌కీ నిక్కీ ఇంకా ఏఏ సినిమాల్లో న‌టిస్తోంది? అంటే .. అడ‌ల్ట్ రొమాంటిక్ కామెడీ `చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టుడు`లో నాయిక‌గా న‌టించింది. ఆ సినిమాలోనూ బోల్డ్ డైలాగ్స్ తో యూత్ గుండెల్ని మ‌రిగించింది ఈ బ్యూటీ. నిక్కీ తంబోలి టూమ‌చ్ బోల్డ్ బ్యూటీ .. మాట‌తీరులోనూ ప‌క్కా బోల్డ్.. అని టీజ‌ర్లు చెబుతున్నాయి. కాంచ‌న 3 ఈవెంట్లో ఆవిడ గురించే హాట్ డిస్క‌ష‌న్ సాగింది. అయితే మాట‌ల్లో చేత‌ల్లో బోల్డ్ గా ఉన్న ఈ బ్యూటీకి సౌత్ లో మ‌రిన్ని అవ‌కాశాలు వ‌రిస్తాయా? అన్న‌ది వేచి చూడాల్సిందే. స‌క్సెస్ కొన్నిటినీ డిసైడ్ చేస్తుంది ఇక్క‌డ‌!