Begin typing your search above and press return to search.

తమిళ 'రంగస్థలం'లో మలుపు హీరోయిన్ కనిపించనుందా..?

By:  Tupaki Desk   |   6 Aug 2020 7:50 AM GMT
తమిళ రంగస్థలంలో మలుపు హీరోయిన్ కనిపించనుందా..?
X
2018లో స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమా రంగస్థలం. స్టార్ హీరో రాంచరణ్, హీరోయిన్ సమంత కెరీర్ లోనే భారీ హిట్టుగా నిలిచింది. అటు కలెక్షన్స్ పరంగాను ఇటు అవార్డుల పరంగాను రికార్డులు సృష్టించింది. ఈ సినిమాలలో సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబుగా రాంచరణ్.. రామలక్ష్మిగా సమంత నటన ఇరగదీసారు. అలాగే మిగతా వారు కూడా అద్భుతంగా నటించారు అవార్డులు అందుకున్నారు. రఫ్ గ్రామీణ యువకుడి పాత్రలో చిట్టిబాబుగా రాంచరణ్ ఎంతగా ఒదిగిపోయాడంటే.. మరో యాక్టర్‌ను ఊహించుకోలేము. ఇలాంటీ క్యారెక్టర్లు కేవలం తమిళ ఇండస్ట్రీలో తమిళ నటులు మాత్రమే చేయగలరనే మాటను ఈ సినిమాతో చెరిపేసారు రంగస్థలం టీం. ఇదిలా ఉండగా రంగస్థలం ఇదివరకు మలయాళంలో, కన్నడలో డబ్ అయి విడుదల అయింది.

కానీ అక్కడ అనుకున్న ఫలితం రాణించలేక పోయింది. ఇక రంగస్థలం సినిమాను తమిళంలో రీమేక్ చేయడానికి ఎప్పటినుండో సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో రాంచరణ్ నటించిన చిట్టిబాబు పాత్రను ప్రముఖ కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్‌ పోషిస్తాడని సమాచారం. అందులో భాగంగానే ఈ చిత్ర తమిళ రీమేక్‌ హక్కులను రాఘవ లారెన్స్‌ పొందినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే వార్త తెగ వైరల్ అవుతుంది. అయితే సమంత నటించిన రామలక్ష్మి పాత్రలో నిక్కీ గల్రాని నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకు ఈమె ఆది పినిశెట్టి సరసన మలుపు, మరకతమణి సినిమాలలో కనిపిచింది. మరి తెలుగులో స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ నటించిన ఈ సినిమాలో లారెన్స్, నిక్కీలు ఎంతవరకు మెప్పిస్తారని సినీవర్గాలలో చర్చలు నడుస్తున్నాయి. ఇక ఈ సినిమాకు పందెంకోడి, ఆవారా సినిమాలను తెరకెక్కించిన లింగుస్వామి దర్శకత్వం వహిస్తారని సమాచారం. చూడాలి మరి సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో..!