సీరియల్ యాక్టరే.. కానీ ఫిగర్ మాత్రం బాప్ రే..!!

Wed Jul 15 2020 20:30:06 GMT+0530 (IST)

Serial actor .. but the figure is  .. !!

మోడల్ నికిత శర్మ.. అంటే తెలుగు ప్రేక్షకులకు అసలు పరిచయం లేదు కావచ్చు. కానీ హిందీ సీరియల్స్ చూసేవారికి మాత్రం నికిత సుపరిచితమే. ఢిల్లీకి చెందిన ఈ భామ.. మోడల్ గా కెరీర్ ప్రారంభించి టీవీ సీరియళ్లలో నటిగా రాణిస్తోంది. హీరోయిన్ అయ్యే అదృష్టం అందరికి రాదు. అలాగని రాకుండా కూడా ఉండదు. వస్తే వదులుకుంటే మాత్రం ఏం చేయలేము. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. వాళ్ల ఫిగర్లకు ఏమాత్రం తగ్గకుండా తన ఫిగర్ మెయింటైన్ చేస్తోంది నికిత. ఈ అమ్మడు కేవలం మోడల్ మాత్రమే కాదు. పలు ప్రొడక్టులకు బ్రాండ్ అంబాసిడర్.. ముఖ్యంగా తను ఒక మోటివేషనల్ స్పీకర్.ఐదుసార్లు టెడెక్స్ టాక్స్ లో మాట్లాడిన ఘనత ఈ ఢిల్లీ భామది. బేసిగ్గా నికిత మల్టీ టాలెంటెడ్. "సిల్వర్ లైనింగ్స్ ఆర్గనైజషన్ అండ్ గుడ్ డీడ్ సాటర్ డే" అనే సంస్థలను స్థాపించి విజయవంతంగా రన్ చేస్తోంది. జీవితంలో మహిళలు తల్చుకుంటే ఏదైనా సాధించగలరు అనే సిద్ధాంతం బాగా నమ్ముతుందట ఈ ముద్దుగుమ్మ. అందుకే ఎవరు ఏమనుకున్నా తన లైఫ్ తనదిగా భావిస్తోంది. అయితే ఇన్ని ప్రత్యేకతలు ఉన్న నికిత మరి సోషల్ మీడియాను ఎలా వాడుకుంటోంది అంటే.. ఈ భామ సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ చురుకుగా ఉంటూ తన గురించి పోస్టులు పెడుతూనే ఉంటుంది.

ముఖ్యంగా అమ్మడి అందాలకు ఫిగర్ కి లక్షలలో అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం పలు సీరియల్స్ తో బిజీగా ఉన్న నికిత.. కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటూ ఫోటోలు పోస్ట్ చేస్తోంది. అమ్మడు ఎంత అందంగా ఉంటుందో అంతే డేర్ కూడా. చీరకట్టు నుండి బికినీ వరకు నిర్మొహమాటంగా ధరించేస్తూ సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. తాజాగా ఓ పిక్ చేసింది నికి బ్యూటీ. ఆ ఫోటోలో అమ్మడు సన్ లైట్ పడుతుండగా.. సోఫాలో కూర్చొని తన అందాలన్నీ ఆరబోసింది. ఎద హొయల నుండి థైస్ వరకు ప్రదర్శిస్తూ కుర్రకారులో చిచ్చు రేపుతోంది. ప్రస్తుతం ఈ పిక్ తెగ వైరల్ అవుతోంది.