Begin typing your search above and press return to search.

గన్ గురిపెట్టి భారీ దొంగతనం.. షాక్ లో హీరోయిన్

By:  Tupaki Desk   |   15 Sep 2021 9:30 AM GMT
గన్ గురిపెట్టి భారీ దొంగతనం.. షాక్ లో హీరోయిన్
X
సినిమాల్లో గన్ లు గురిపెట్టడం కామన్. కానీ నిజజీవితంలో అలాంటి హారిబుల్ సంఘటన జరిగితే చమటలు పట్టడం ఖాయం. తాజాగా బాలీవుడ్ నటికి జీవితంలోనే మర్చిపోలేని షాకింగ్ ఘటన ఎదురైంది.

బాలీవుడ్ నటికి గన్ గురిపెట్టి ఏకంగా లక్షల్లో దొపిడీ చేశారు దొంగలు. ఈ షాకింగ్ ఘటన నుంచి ఆమె ఇంకా తేరుకోలేదని సమాచారం. నటి నికితా రావల్ బాలీవుడ్ తోపాటు దక్షిణ భారతీయు సినిమాల్లో మంచి ఆర్గనైజర్ గా, పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు.. ఆమె 'మిస్టర్ హాట్ మిస్టర్ కూల్', 'ది హీరో -అభిమన్యు', 'గరం మసాలా' , అక్షయ్ కుమార్-జాన్ అబ్రహం 'క్యూట్ కామినా' వంటి సినిమాల్లో నటించింది.

తాజాగా సమచారం ప్రకారం.. నికితా రావల్ గత వారం దేశ రాజధాని ఢిల్లీలో బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు కొంతమంది దొంగలు ఆమెను తుపాకీతో బెదిరించి ఏడు లక్షలకుపైగా దోచుకెళ్లారు. ఆ తర్వాత ఆమె భయంతో డిల్లీ నుంచి ముంబై వచ్చేసిందిట...

తాజాగా ఈ విషయాన్ని నికితా బయటపెట్టింది. 'రాత్రి 10 గంటల సమయంలో నేను అత్త ఇంటికి వెళుతున్నప్పుడు ఇన్నోవా అతి వేగంగా వచ్చి నా వాహనాన్ని ఆపివేసింది. ఆపై నలుగురు ముసుగులు ధరించిన వ్యక్తులు కారు నుంచి బయటకు వచ్చి నాకు తుపాకీని చూపించారు. నా దగ్గర ఉన్న విలువైన వస్తువులను ఇచ్చేయమని బెదిరించారు. నా ఒంటిపై ఉన్న బంగారం, నగదు అంతా దోచుకున్నారు. వాటి విలువ సుమారు రూ.7 లక్షల వరకు ఉంటుంది.

ఈ షాకింగ్ ఘటనతో డిస్టబ్ అయినట్లు నికిత తెలిపింది. అప్పటి నుంచి సరిగ్గా తినడం కూడా లేదని వాపోయింది. నిద్రకూడా పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేసినట్టు తెలిపింది.