హిందీలో నిఖిల్ దెబ్బ.. బడా హీరోలపై ప్రభావం!

Wed Aug 17 2022 15:00:02 GMT+0530 (IST)

Nikhil hit in Hindi.. Impact on big heroes!

కార్తికేయ 2 సినిమా విడుదలకు ముందు ఈ సినిమా ఇండియన్ సినిమా అంటూ చేసిన ప్రమోషన్స్ ఎంతవరకు ఉపయోగపడతాయో అని అందరూ అనుకున్నారు. కానీ నిఖిల్ నమ్మకం చాలా వరకు నిజమైంది. కార్తికేయ 2 సినిమా భక్తి ఫార్మాట్ లో నార్త్ జనాలను ఎంతగానో ఏట్రాక్ట్ చేస్తోంది. ఇదివరకే అక్కడ అమీర్ ఖాన్ సినిమాకు తీవ్రస్థాయిలో నెగిటివ్ టాక్ రావడం అంతేకాకుండా విడుదలకు ముందే ఆ సినిమా బాయ్ కాట్ చేయాలి అంటూ వార్తలు వైరల్ అవ్వడం కార్తికేయ 2 సినిమాకు చాలా బాగా ఉపయోగపడింది.ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలి అంటూ నార్త్ జనాలు బాలీవుడ్ హీరోలకు దిమ్మతిరిగేలా కౌంటర్ అయితే ఇస్తున్నారు అని చెప్పవచ్చు. కార్తికేయ 2 సినిమా రోజురోజుకు థియేటర్ల సంఖ్యను పెంచుకుంటుంది. రక్షాబంధన్ లాల్ సింగ్ చడ్డా కలెక్షన్స్ చాలావరకు తగ్గిపోయేలా చేస్తూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.

అసలు తెలుగులో మిడియం రేంజ్ సినిమాలు వస్తేనే నిఖిల్ సినిమాకు కొంత పోటీ ఉంటుంది అని అభిప్రాయాలు వచ్చేవి. అలాంటిది అతను  బాలీవుడ్ ఇండస్ట్రీలో వేల కోట్ల మార్కెట్ చూసిన హీరోతో పోటీ పడడం అంటే అంత సాధారణమైన విషయం కాదు.

ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా సినిమా మంగళవారం రోజు కేవలం రెండు కోట్ల కలెక్షన్స్ మాత్రమే అందుకుంది. ఇక మరోవైపు అక్షయ్ కుమార్ రక్షాబంధన్ కోటి పైగా కలెక్షన్స్ అందుకుంది. అయితే నిఖిల్ సినిమా కోటి వరకు కలెక్షన్స్ అందుకోకపోయినప్పటికీ 75 లక్షల కలెక్షన్స్ తో మాత్రం దాదాపు అక్కడి వారితో సమానంగా పోటీపడింది అని చెప్పవచ్చు.. హిందుత్వం సెంటిమెంట్తో నార్త్ జనాలు ఊగిపోతున్న సమయంలో కరెక్ట్ సినిమా వదిలారు.

దానికి తోడు ఇదివరకే నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా అక్కడ ది కాశ్మీర్ ఫైల్స్ తో హిందూ జనాలను గట్టిగానే ఎట్రాక్ట్ చేశారు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ బ్యాగ్రౌండ్ లో వచ్చిన సినిమా అంటూ కార్తికేయ 2 బాగా హైలైట్ చేశారు.

ఏదేమైనా కూడా నిఖిల్ సినిమా అక్కడ బాలీవుడ్ సినిమాలతో పోటీపడుతూ కలెక్షన్స్ అందుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇదే తరహాలో కొనసాగితే మాత్రం తదుపరి వారం వరకు కూడా సినిమా హిందీలోనే 10 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకున్న ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. మరి మొత్తంగా ఏ స్థాయిలో వసూళ్ళు అందుతాయో చూడాలి.