Begin typing your search above and press return to search.

రేంజ్ రోవర్ ఫ్యామిలీలో నిఖిల్.. ఫుల్ జోష్

By:  Tupaki Desk   |   24 Jan 2021 4:14 PM GMT
రేంజ్ రోవర్ ఫ్యామిలీలో నిఖిల్.. ఫుల్ జోష్
X
హీరో నిఖిల్ ఫుల్ జోష్ మీదున్నాడు. యూత్ మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన ‘హ్యాపీ డేస్’ సినిమాతో ఇండస్ట్రీలో లాంఛ్ అయిన నిఖిల్ సిద్దార్థ్.. ఆ సినిమాలోని వాళ్లంతా సైడ్ అయిపోగా.. తాను మాత్రం ఇంకా రేసులో కంటిన్యూ అవుతున్నాడు.

అయితే.. నిఖిల్ ను వరుస ప్లాపులు వేధించాయి. ‘స్వామిరారా’ సినిమాతో నిఖిల్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలైందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఎక్కడికిపోతావు చిన్నవాడా అంటూ మాంచి హిట్ అందుకున్నాడు. ఆ మూవీ తర్వాత వచ్చిన సినిమా ‘అర్జున్ సురవరం’ సినిమాతోనూ ఫర్వాలేదనిపించుకున్నాడు.

ప్రస్తుతం సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘18 పేజీస్’ సినిమాలో నటిస్తున్నాడు నిఖిల్. ఈ చిత్రానికి పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తుండగా.. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు చందూ మొండేటి దర్శకత్వంలో చేయనున్న ‘కార్తికేయ 2’ సినిమాపైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే.. తాజాగా నిఖిల్ లేటెస్ట్ గా రేంజ్ రోవర్ కార్ కొనుగోలు చేశాడు. దీంతో తాను కూడా రేంజ్ రోవర్ ఫ్యామిలీలో చేరిపోయాడు నిఖిల్. బ్లాక్ షైనింగ్ తో రాయల్ లుక్ లో మెరిసిపోతున్న తన న్యూ కార్ తో కలిసి ఫొటో దిగాడు నిఖిల్. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. మొత్తానికి కెరీర్ లో జోరు చూపిస్తున్న నిఖిల్.. రేంజ్ రోవర్ కొనుగోలు చేసి, తన రేంజ్ ను మరో స్టెప్ కు తీసుకెళ్లాడీ హీరో.