Begin typing your search above and press return to search.

'ప్రేమమ్' డైరెక్టర్ ఫేక్ అకౌంట్ ని బయటపెట్టిన యువ హీరో...!

By:  Tupaki Desk   |   28 Sep 2020 9:30 AM GMT
ప్రేమమ్ డైరెక్టర్ ఫేక్ అకౌంట్ ని బయటపెట్టిన యువ హీరో...!
X
ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని సోషల్‌ మీడియా వేదికగా కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. సినీ రాజకీయ ప్రముఖుల పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి పోస్టులు చేస్తున్నారు. ప్రతి సెలబ్రిటీ ఖాతాకి అదే పేరుతో మరో ఫేక్ అకౌంట్ కచ్చితంగా ఉంది. అందులో కొంతమంది ఇష్టానుసారం అభ్యంతరకరమైన అసభ్యకరమైన పోస్టులు పోస్టులు పెడుతూ సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఈ మధ్య రావు రమేష్ - ఉత్తేజ్ - అలీ లాంటి వారు తమ పేర్ల మీద ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి పోస్టులు పెడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా దర్శకుడు చందు మొండేటి పేరుతో ఉన్న ఫేక్ ట్విట్టర్‌ అకౌంట్‌ ని బయటపెట్టాడు యువ హీరో నిఖిల్ సిద్దార్థ్.

ఇటీవల 'ప్రేమమ్' 'కార్తికేయ' సినిమాల దర్శకుడు చందు మొండేటి బర్త్ డే సందర్భంగా ట్విట్టర్ లో సెలబ్రిటీలు అందరూ ఆయనకు విషెస్ చెప్పారు. వీటికి థ్యాంక్స్ చెప్తూ చందు మొండేటి ట్వీట్స్ పెట్టాడు. అయితే నిఖిల్ సిద్దార్థ్ ఇది చందు ఒరిజినల్ అకౌంట్ కాదని ఫన్నీగా ట్వీట్ చేశాడు. ఆ ఫేక్ అకౌంట్ ని రీట్వీట్ చేస్తూ.. 'ఎక్స్ట్రార్డినరీ యాక్టింగ్ అమ్మా.. సరదాగా మూవీ ఆడిషన్స్ కి రావచ్చుగా' అని ట్వీట్ చేశాడు. ఆ ఫేక్ ట్విట్టర్ అకౌంట్ ని రిపోర్ట్ చేయమని చెప్తూ చందు మొండేటి ఒరిజినల్ అకౌంట్ ని తెలియజేసాడు. చందు పేరుతో ఫేక్ అకౌంట్ రీసెంటుగా క్రియేట్ చేశారు. అయితే ఎప్పటి నుంచో చందు మొండేటి ఒరిజినల్ లో కేవలం మూడు ట్వీట్స్ ఉంటే.. ఫేక్ అకౌంట్ లో అప్పుడే 26 ట్వీట్స్ చేయడం గమనార్హం.