నిఖిల్ ముద్ర రిలీజ్ ముహూర్తం ఇదే!

Fri Aug 10 2018 11:43:26 GMT+0530 (IST)

తెలుగులో ఉన్న యంగ్ జెనరేషన్ హీరోల్లో మంచి కథలు ఎంచుకుంటూ డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్నది చాల తక్కువ మంది. ఆ తక్కువ మందిలో నిఖిల్ పేరును తప్పని సరిగా చెప్పుకోవాలి.  ఈ హీరో లాస్ట్ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది గానీ ఇప్పుడు మాత్రం ఓ ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.తమిళంలో సూపర్ హిట్ అయిన 'కనిదన్' సినిమా రీమేకే ఈ 'ముద్ర'.  తమిళంలో సీనియర్ హీరో మురళి కొడుకు అథర్వ హీరోగా నటించగా TN సంతోష్ దర్శకత్వం వహించాడు  ఇప్పుడు తెలుగులో నిఖిల్ హీరో గా అదే డైరెక్టర్ రీమేక్ ను తెరకెక్కిస్తున్నాడు.  ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఫిలింమేకర్స్ రిలీజ్ డేట్ ను లాక్ చేశారట.   నవంబర్ 8 న ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం.

లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కమెడియన్ సత్య ఈ సినిమాలో మరో కీలక పాత్ర లో నటిస్తున్నాడు.  ఫేక్ సర్టిఫికేట్ రాకెట్  నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిఖిల్ ఒక జర్నలిస్ట్ గా నటిస్తున్నాడు.  కంటెంట్ స్ట్రాంగ్  కాబట్టి ఈ సారి నిఖిల్ కు మంచి హిట్ వస్తుందని దాదాపుగా ఫిక్స్ అయిపోవచ్చు!