పాన్ ఇండియా లెవెల్లో నిఖిల్ మరో సినిమా

Tue May 24 2022 13:00:02 GMT+0530 (IST)

Nikhil Movie in Pan India Level

ఏ హీరోని కదిలించినా పాన్ ఇండియా ప్రాజెక్ట్ ముచ్చట్లు చెబుతున్న విషయం తెలిసిందే. బడా హీరోల నుంచి మినిమమ్ గ్యారెంటీ హీరోల వరకు ప్రతీ ఒక్కరూ ఇప్పడు పాన్ ఇండియా జపం చేస్తున్నారు. అయితే కొంత మంది మాత్రం ప్రాజెక్ట్ డిమాండ్ ని బట్టి పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్స్ చేస్తున్నారు. ఇప్పటికే 'స్పై' సినిమాతో పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేసిన యంగ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ మరో సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.వివరాల్లోకి వెళితే.. నిఖిల్ హీరోగా నటించిన మూవీ 'కార్తికేయ'. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొంఏటి ఈ మూవీని తెరకెక్కించారు. తొలి ప్రయత్నంలోనే ఈమూవీతో సూపర్ సక్సెస్ ని సొంతం చేసుకున్న ఆయన మళ్లీ ఇన్నాళ్లకు ఈ మూవీకి సీక్వెల్ ని చేస్తున్నారు. నిఖిల్ హీరో గా 'కార్తీకేయ' సీక్వెల్ గా 'కార్తికేయ2'ని రూపొందిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్  హీరోయిన్ గా నటిస్తోంది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై టి.జి. విశ్వప్రసాద్ అబిషేక్ అగర్వాల్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తొలి పార్ట్ సూపర్ సక్సెస్ కావడంతో దానికి సీక్వెల్ గా రూపొందుతున్న 'కార్తికేయ 2' పై కూడా భారీ అంచనాలున్నాయి. జూలై 22న ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి బయటికి వచ్చింది. చందూ మొండేటి చెప్పిన కథకి మించి ఔట్ పుట్ రావడంతో మేకర్స్ చాలా ఇంప్రెస్ అయ్యారట.

ఎలాగైనా ఈ మూవీని హిందీలోనూ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే హిందీలో డబ్బింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా తన పాత్రకు తానే హీరో నిఖిల్ హిందీలో డబ్బింగ్ చెప్పబోతున్నారట.

తెలుగు చిత్రాలు బాలీవుడ్ లో భారీ వసూళ్లని రాబడుతున్న నేపథ్యంలో మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందుతున్న 'కార్తికేయ 2' కూడా అక్కడ అనూహ్య విజయాన్ని సాధించడం ఖాయం అని ఆ నమ్మకంతోనే ఈ మూవీని హిందీలోనూ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారని తెలిసింది. విఎఫ్ ఎక్స్ ప్రధానంగా సాగే ఈ మూవీ విజువల్స్ పరంగానూ విశేషంగా ఆకట్టుకోవడం ఖాయమని తెలుస్తోంది.