Begin typing your search above and press return to search.

నిఖిల్ `కార్తికేయ 2` లాంచింగ్ కి రెడీ

By:  Tupaki Desk   |   27 Feb 2020 4:43 PM GMT
నిఖిల్ `కార్తికేయ 2` లాంచింగ్ కి రెడీ
X
2019 ఆద్యంతం యంగ్ ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ డైల‌మా గురించి తెలిసిందే. అర్జున్ సుర‌వ‌రం మూవీ ప‌దే ప‌దే రిలీజ్ వాయిదా ప‌డ‌డం .. ర‌క‌ర‌కాల వివాదాలు నిఖిల్ ని ఇబ్బంది పెట్టాయి. ఆ క్ర‌మంలోనే అత‌డు చాలా డిస్ట్ర‌బ్ అయ్యాడు. ఓవైపు కొత్త సినిమాని ప్ర‌క‌టించ‌లేడు. అలాగ‌ని పూర్త‌యిన దానిని రిలీజ్ చేయ‌లేడు! అన్న‌ట్టుగా డైల‌మాలోనే కాలం గ‌డిపేసాడు. ఏడాది ముగింపులో అర్జున్ సుర‌వ‌రం రిలీజై హిట్ కొట్ట‌డం అత‌డికి పెద్ద ఊర‌ట‌నిచ్చింది.

స‌క్సెస్ తో 2020 ఆరంభం నిఖిల్ లో రెట్టించిన ఉత్సాహం క‌నిపించింది. ఇదే జోష్ తో చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ 2ని ప్ర‌క‌టించారు. అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తోంది. ఇప్ప‌టికే ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయి. ఎట్ట‌కేల‌కు మార్చి 2 న కార్తికేయ2 పూజా కార్యక్రమం జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

కార్తికేయ లాంటి క్లాసిక్ హిట్ చిత్రానికి సీక్వెల్ అన‌గానే అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది. ఈసారి చందు మొండేటి మ‌రింత ప‌క‌డ్భందీ స్క్రిప్టుతో ప్రిపేర్డ్ గా ఉన్నాడ‌ని తెలుస్తోంది. స‌వ్య‌సాచి లాంటి ఫ్లాప్ త‌ర్వాత అత‌డు త‌ప్పనిసరి గా హిట్టు కొట్టాల్సిన స‌న్నివేశం ఉంది. మ‌రి ఆ ఫీట్ సాధ్య‌మ‌వుతుందా లేదా? అన్న‌ది చూడాలి. ఇక నిఖిల్ తొంద‌ర్లోనే ఓ ఇంటివాడు అవుతున్నాడు కాబ‌ట్టి.. రెట్టించిన‌ ఉత్సాహంలోనే కొత్త సినిమాని ప్రారంభించి అందులో న‌టించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. పెళ్లి షెడ్యూల్ కి ఇబ్బంది లేకుండానే షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడ‌న్న‌మాట‌.