హీరోల కెరీర్ లో మ్యారేజ్ లైఫ్ ఎలాంటి మార్పులు తెస్తుందో...!

Sun Aug 09 2020 13:00:02 GMT+0530 (IST)

Nikhil, Nithin And Rana Film Career After Marriage

టాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లిళ్ల సందడి కొనసాగుతోంది. ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోలు అందరూ పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా వివాహ వేడుకలు వాయిదా వేసుకుంటూ వచ్చినప్పటికీ.. ఈ వైరస్ ఇప్పట్లో మనల్ని వదిలేలా లేదు అని భావించి ఒక్కొక్కరుగా పెళ్లిళ్లకు సిద్ధమయ్యారు. ముందుగా యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఓ ఇంటివాడయ్యాడు. తాను ప్రేమించిన ప్రియసఖి పల్లవి వర్మని మూడు ముళ్ల బంధంతో ముడి వేసుకున్నాడు. ఈ క్రమంలో హీరో నితిన్ కూడా పెళ్లి చేసుకున్నాడు. చాలా ఏళ్ళ నుండి ప్రేమిస్తున్న తన ప్రేయసి షాలినీ కందుకూరిని వివాహం చేసుకున్నాడు. వీరితో పాటు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన దగ్గుబాటి రానా కూడా ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. నిన్న ఇరు కుటుంబ సభ్యులు కొద్దిమంది అతిథుల మధ్య తాను ప్రేమించిన మిహికా బజాజ్ మెడలో మూడు ముళ్ళు వేసాడు. అయితే ఈ హీరోలందరూ ఇప్పటి నుండి ఫ్యామిలీ లైఫ్ ని కెరీర్ ని ఎలా బ్యాలన్స్ చేయబోతున్నారని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు.వాస్తవానికి పెళ్లయ్యాక చాలామంది హీరోల సినీ కెరీర్ డౌన్ ఫాల్ అయింది. స్టార్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ - అల్లు అర్జున్ వంటి వారికి వివాహం అయిన వెంటనే డిజాస్టర్స్ వచ్చేసాయి. ఇక కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా పెళ్లి తర్వాత వరుస ప్లాప్స్ ఎదుర్కొని.. 'మహర్షి' సినిమాతో నిలదొక్కుకున్నాడు. వీరితో పాటు మంచు హీరోలు విష్ణు - మనోజ్ లు కూడా సక్సెస్ ఫుల్ సినిమాలను అందించలేకపోయారు. అయితే పెళ్లి తర్వాత కొన్ని ప్లాప్స్ ఎదుర్కొన్నా వారిలో కొందరు మళ్ళి ట్రాక్ లోకి ఎక్కి వరుస విజయాలను అందుకుంటున్నారు. ఫ్యామిలీ లైఫ్ ని కెరీర్ ని బ్యాలన్స్ చేస్తూ ఫ్యామిలీ మ్యాన్ అని పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కొత్త పెళ్లికొడుకులు నిఖిల్ - నితిన్ - రానా ల కెరీర్ లో మ్యారేజ్ లైఫ్ ఎలాంటి మార్పులు తెస్తుందో చూడాలి. సినిమాల పరంగా ఇప్పటివరకు ముగ్గురు హీరోలు దూకుడు చూపిస్తున్నారు. నితిన్ నాలుగు సినిమాలు.. నిఖిల్ మూడు సినిమాలు.. రానా మూడు సినిమాలు లైన్లో పెట్టారు. ఈ సినిమాలతో సక్సెస్ అందుకొని మ్యారేజ్ తర్వాత టాలీవుడ్ హీరోలు ప్లాప్స్ అందుకుంటారు అనే సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారేమో చూడాలి.