తన మొబైల్ సీక్రెట్స్ బయటపెట్టిన మెగా డాటర్...!

Thu Jul 16 2020 07:00:04 GMT+0530 (IST)

Mega Daughter Reveals Her Mobile Secrets ...!

మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇటు సినిమాలు చేస్తూనే అటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు మూడు వెబ్ సిరీస్ లతో పాటు ఆమె తమిళ్ లో ఓ సినిమా.. తెలుగులో నాలుగు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటి వరకు అందరూ హీరోలే పరిచయం కాగా నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడంతో సినీ అభిమానుల దృష్టి ఎక్కువగా ఆమె పై ఉంది. దీంతో ఆచితూచి చిత్రాలు సెలెక్ట్ చేసుకుంటోంది నిహారిక. ఇక పర్సనల్ లైఫ్ విషయానికొస్తే నిహారిక కొణిదెల త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. జొన్నలగడ్డ చైతన్య అనే అబ్బాయితో నిహారిక పెళ్లి చేయడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. తనకు కాబోయే భర్త గురించి సోషల్ మీడియాలో కొన్ని క్లూస్ ఇస్తూ ఫైనల్ గా ఫుల్ ఫోటో రివీల్ చేసింది నిహారిక. ఇక వీరిద్దరి నిశ్చితార్థం ఆగస్టులో ఉండబోతోందని.. వచ్చే ఏడాది పెళ్లి వేడుక ఉంటుందని సమాచారం.ఇదిలా ఉండగా మెగా డాటర్ నిహారిక కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవల నిహారిక పోస్ట్ చేసే ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. సినిమాల్లో పద్ధతిగా ఉండే రోల్స్ చేస్తూ వస్తున్న నిహారిక తన రూటు మార్చి ట్రెండీ డ్రస్సులతో అదరగొడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటికే పరిమితమైన నిహారిక తాజాగా సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో ముచ్చటించింది. ఈ క్రమంలో నెటిజన్లు అడిగిన చిలిపి ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ 'మీ ఫేస్ మీద పింపుల్ చూసా' అని చెప్పగా ''కంగ్రాట్స్.. అవార్డు ఇంటికి పంపిస్తా'' అని కొంటెగా సమాధానం చెప్పింది. మరో వ్యక్తి నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారని అడుగగా తమిళంలో ఓ మూవీ చేస్తున్నానని వెల్లడించింది. ఇక మరో కొంటె నెటిజన్ మీ ఫోన్ వాల్ పేపర్ ఏంటని ప్రశ్నించగా.. కాబోయే భర్త చైతన్యతో రొమాంటిక్ గా దిగిన ఫోటోను వాల్ పేపర్ గా పెట్టుకున్నానని షేర్ చేసి చూపించింది. దీంతో నిహారిక కొణిదెల మొబైల్ లో ఉన్న కొన్ని యాప్స్ కూడా అందరికీ తెలిసిపోయాయి.