#నిహారిక వెడ్డింగ్.. కాళ్లు పట్టారా.. మొక్కుతున్నారా?

Fri Dec 04 2020 15:00:01 GMT+0530 (IST)

#Niharika Wedding Update

మెగా డాటర్ నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ ఒక రేంజులో సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి. రాజస్థాన్ ఉదయ్ పూర్ ప్యాలెస్ లో ఈ వివాహం డిసెంబర్ 9న జరగనుంది. ఈ బుధవారం నుంచే ఈ పెళ్లి కి సంబంధించిన అసలు సంబరాలు మొదలయ్యాయి.ఇక ఈ ప్రీవెడ్డింగ్ ఈవెంట్లలో నిహారిక సిస్టర్స్ కజిన్స్ సందడి ఓ రేంజులో ఉంది. దీంతో పాటే నిహారిక స్నేహితుల సందడి మామూలుగా లేదు. మరోవైపు వరుడి తరపున బంధువులు స్నేహితుల తో ఇంతే సందడి నెలకొందట.

బుధవారం నాడు నాగబాబు హైదరాబాద్ ఇంట్లోనే పెళ్లి సంబరాలు పతాక స్థాయికి చేరుకున్నాయట. అందుకు సంబంధించిన ఫోటోలు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. వీటిలో మెగా ప్రిన్సెస్ చిరునవ్వులు చిందిస్తూ పొడవాటి లెహెంగా ధరించి కనిపించింది. ఇది అందమైన ఎంబ్రాయిడరీతో రెండు కళ్లు చాలవు అన్నంత గొప్పగా డిజైన్ చేసిన డ్రెస్. ఇక తనకు అలంకరణ చేస్తూ స్నేహితులు ఇలా వంగారు. యథాలాపంగా తీసిన ఆ ఫోటో అంతర్జాలంలో హైలైట్ అవుతోంది. ఇంతకీ వాళ్లు ఎందుకని అలా వంగారు? అంటే.. తన కాలికి హీట్స్ అలంకరణ చేస్తున్నారట. నిహారిక కాలికి మొక్కుతున్నారా? అంటూ ఫన్నీ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంబరాల్లో మెగా.. అల్లు ఫ్యామిలీ రచ్చ రచ్చ చేశాయి. ఇక ఈ ప్రీవెడ్డింగ్ ఈవెంట్లోనే చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత హబ్బీ బర్త్ డే వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారని తెలిసింది.

ఇంతకీ తన ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో అంటూ నిహారిక నవ్వులు చిందిస్తుంటే ఆకాశంలో చందమామ నవ్వినట్టుగా ఉందంటూ నవవధువును పొగిడేస్తున్నారు ఫ్యాన్స్. రాకుమారిలా నిహారిక ఎంతో అందంగా ఉందన్న ప్రశంసలు కురుస్తున్నాయి.