Begin typing your search above and press return to search.

నిహారిక‌ పెళ్లి టీజ‌ర్.. అచ్చంగా బాపు బొమ్మే!

By:  Tupaki Desk   |   13 Aug 2020 5:00 AM GMT
నిహారిక‌ పెళ్లి టీజ‌ర్.. అచ్చంగా బాపు బొమ్మే!
X
నిహారిక కొణిదెల‌.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. మెగాబ్ర‌ద‌ర్ నాగబాబు గారాల కుమార్తె. వెబ్ సిరీస్ లు.. సినిమాలు .. అంటూ నిహారిక చేయ‌ని ప్రయ‌త్నం లేదు. మునుముందు టాలీవుడ్ నిర్మాత‌గానూ త‌న‌దైన ముద్ర వేసేందుకు ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేస్తున్నారన్న ప్ర‌చారం ఉంది. ఇక నాలుగైదేళ్ల పాటు న‌ట‌న‌లో కొన‌సాగేందుకు నాగ‌బాబు అంగీక‌రించినా.. పెళ్లికి స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు మాత్రం న‌ట‌న‌ను విర‌మించాల‌ని చెప్పేశార‌ని నిహారిక‌నే స్వ‌యంగా ఇంట‌ర్వ్యూల్లో చెప్పారు. ఆ స‌మ‌యం రానే వ‌చ్చింది.

ఇటీవ‌లే గుంటూరు రేంజ్ ఐజీ కుమారుడు వెంకట చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి నిశ్చయమైంది. వ‌రుడు ఐటీ కంపెనీ ఉద్యోగి. హీరోల‌ను త‌ల‌ద‌న్నే ఛరిష్మా ఈ యంగ్ బోయ్ కి ఉంది. ఇక ఐజీ గారి కుటుంబంతో మెగా ఫ్యామిలీ అనుబంధం ఇప్ప‌టిది కాదు. చాలా కాలంగా కొన‌సాగుతున్న‌దే. అందుకే మెగాస్టార్ చిరంజీవి త‌మ కుటుంబాల మ‌ధ్య ఉన్న స్నేహాన్ని ఇప్పుడు బంధంగా మార్చారు. అందుకే పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నార‌ని ప్ర‌చార‌మైంది. త్వ‌ర‌లోనే చైత‌న్య‌- నిహారిక జంట నిశ్చితార్థం జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే పెళ్లి ప్ర‌క‌ట‌న వెలువ‌డిన అనంత‌రం చైత‌న్య‌తో నిహారిక ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యింది.

అదంతా అటుంచితే నిహారిక ఓవైపు పెళ్లికి రెడీ అవుతూనే టీవీ కార్య‌క్ర‌మాల్ని విడిచిపెట్ట‌డం లేదు. తాజాగా అంత‌ర్జాలంలో రిలీజైన పెళ్లి టీజ‌ర్ అదిరిపోయింది. అచ్చంగా బాపు బొమ్మ‌నే ఇలా వ‌చ్చిందా? అన్నంత అందంగా .. పెళ్లి కూతురు గెట‌ప్ తో మెరిసిపోయింది. ఇక ఈ కార్య‌క్ర‌మం జీతెలుగులో ప్ర‌సారం కానుంది. `బాపు బొమ్మకు పెళ్లి` పేరుతో ఈ షోని చేస్తుండ‌గా నాగ‌బాబు హోస్టింగ్ చేస్తున్నారు. వినాయ‌క చ‌వితి ప్ర‌త్యేక కార్య‌క్ర‌మ‌మిదని తెలుస్తోంది. ఇక ఈ షోని అనసూయ స‌హా ప‌లువురు టాప్ యాంక‌ర్ల‌తో అద‌ర‌గొట్ట‌బోతున్నార‌ట‌.