మ్యాగజైన్ కోసం రెచ్చిపోయిన మెగా డాటర్..!

Tue Jun 02 2020 22:52:36 GMT+0530 (IST)

Niharika Konidela Poses for Tulip

నిహారిక కొణిదెల.. ఇటు సినిమాలు చేస్తూనే అటూ డిజిటల్ వరల్డ్ లోను రాణిస్తోంది. మెగా ఫ్యామిలీలో ఇప్పటి వరకు ఇండస్ట్రీకి పరిచయమైన వారిలో నిహారిక ఒకరు. ఇప్పటి వరకు ఆమె తమిళ్ లో ఒక సినిమా.. తెలుగులో మూడు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఫస్ట్ సినిమా నాగ సౌర్య తో చేసిన 'ఒక మనసు'తో పర్వాలేదు అనిపించుకుంది. తమిళ్ లో 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి సరసన 'ఒరు నల్ల నాల్ పాతు సొల్రేన్' అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత వచ్చిన 'హ్యాపీ వెడ్డింగ్' 'సూర్యకాంతం' సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయనే చెప్పాలి. కానీ డిజిటల్ రంగంలో అడుగుపెట్టి నిహారిక నటించిన వెబ్ సిరీస్ ‘ముద్ద పప్పు ఆవకాయ’ మంచి ఆదరణ పొంది నెటిజన్లకు దగ్గరైంది. ఇటీవల చిరంజీవి 'సైరా నరసింహా రెడ్డి' సినిమాలో నిహారిక బోయ యువతి పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడంతో సినీ వర్గాల దృష్టి కూడా ఎక్కువగా నిహారిక పై ఉంది. ప్రేక్షకులు కూడా నిహారిక సినిమాలపై మంచి అంచనాలతో వస్తున్నారు. దీంతో ఆచితూచి చిత్రాలు ఎంపిక చేసుకుంటోంది నిహారిక.కాగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే నిహారిక ఈ మధ్య కొన్ని పిక్స్ ను పోస్ట్ చేసింది. అందులో సూపర్ స్టైలీష్ లుక్ లో కేక పుట్టించింది నిహారిక. మెగా డాటర్ నిహారిక తన రూటు మార్చేసిందని అర్థం అవుతోంది. ఇప్పటి వరకు పద్ధతైన దుస్తుల్లో కనిపించిన నిహారిక ఇప్పుడు ట్రెండీ డ్రస్సులతో తన అందాల తలుపులు తెరిచేసింది. సోషల్ మీడియా వేదికగా అందాల విందును వడ్డించడం స్టార్ట్ చేసింది. ఆమె పోస్ట్ చేస్తున్న లేటెస్ట్ ఫోటో షూట్స్ చూసి మెగా డాటర్ ఈ రేంజ్ లో కూడా కిక్కిస్తుందా అని షాక్ అవుతున్నారు నెటిజన్లు. కాగా తాజాగా నిహారిక తులిప్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసింది. ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ అయిన తులిప్ 10వ యానివర్సరీ సందర్భంగా కవర్ పేజీ పై ప్రచురించిన నిహారిక ఫోటో చూస్తే.. ఆ విషయంలో కొంచెం హద్దులు దాటినట్టే అన్పిస్తుంది.

ఈ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన మెగా డాటర్.. తులిప్ మ్యాగజైన్ 10వ వార్షికోత్సవ ఎడిషన్ పై తన ఫోటో ప్రింట్ చేయడం సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ ఫోటోలో బ్యాక్ లెస్ పోజిస్తూ కనిపిస్తోంది నిహారిక. ఇప్పటి వరకు పద్ధతిగా కెమెరా ముందు కనిపించిన మెగా డాటర్.. ఇక సినిమాలు వెబ్ సిరీస్ ఏదైనా అందాలు ఆరబోసేందుకు రెడీ అన్నట్లు ఫోజ్ ఇచ్చింది. మత్తెక్కించే కళ్ళు ఆమె చూస్తున్న చూపు నెటిజన్ల గుండెల్లో గుచ్చుకుంటోంది. గ్లామర్ రోల్స్ చేయడానికి రెడీ అని.. కథ డిమాండ్ చేస్తే అందాల విందుకు వెనుకాడేది లేదని చెప్పకనే చెబుతోంది. మరి ఒక్కసారిగా మెగా డాటర్ అందాల ప్రదర్శన చూసిన మెగా అభిమానులకు కోపం తెప్పిస్తుందేమో.. ఈ ఫోటోలపై వారు ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం నిహారిక పెట్టిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.