Begin typing your search above and press return to search.

మెగా ప్రిన్సెస్ ని ఆదుకునే దేవుడు?

By:  Tupaki Desk   |   15 Dec 2019 6:42 AM GMT
మెగా ప్రిన్సెస్ ని ఆదుకునే దేవుడు?
X
మెగా డాట‌ర్ నిహారిక క‌థానాయిక‌గా టాలీవుడ్ లో నిల‌దొక్కుకోవాల‌ని చాలానే క‌ల‌లు కంది. కానీ ఇంకా ఆ డ్రీమ్ నెర‌వేర లేదు. హిట్టును న‌మ్మే సెంటిమెంటు ప‌రిశ్ర‌మ‌లో అది కొర‌వ‌డితే ఎలా ఉంటుందో త‌న‌కు ప్రాక్టిక‌ల్ గానే అర్థ‌మైంది. మినిమం రేంజ్ హీరోల స‌ర‌స‌న న‌టించాల‌న్నా హిట్టే కొల‌మానం. మెగా ఫ్యాన్స్ ఒత్తిళ్ల మేర‌కు కొన్ని నియ‌మ‌ నిబంధ‌న‌లకు క‌ట్టుబ‌డి మెగా ప్రిన్సెస్ ఎంట్రీ జ‌రిగింది కాబ‌ట్టి ఆ కార‌ణం కూడా కెరీర్ ప‌రంగా వెనుక‌డేలా చేసింది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏ సినిమా ప్రారంభించినా అందులో నిహరిక‌కు ఛాన్స్ ఉంటుంద‌ని క‌థ‌నాలొస్తూనే ఉన్నాయి. నిహారిక ఎంట్రీ ద‌గ్గ‌ర నుంచి ఇలాంటి క‌థ‌నాలు ష‌రా మామూలే అయ్యాయి. నిహారిక హీరోయిన్ గా ప‌రిచ‌య‌మ‌య్యేది బ‌న్ని సినిమాతోనే అంటూ అప్ప‌ట్లో సాగిన ప్ర‌చారం వ‌ల్ల‌నే ఇదంతా.

దీనిపై చిల‌వ‌లుప‌ల‌వులుగా నిర్మాత అల్లు అర‌వింద్ కూడా స్పందించి జ‌వాబివ్వాల్సి వ‌చ్చింది. తాజాగా బ‌న్ని న‌టిస్తున్న‌ 20వ చిత్రంలో మెగా ప్రిన్సెస్ నిహారిక త‌ప్ప‌కుండా ఓ మంచి రోల్ ద‌క్కించుకుంనే అవ‌కాశం ఉంద‌ని మ‌రోసారి క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో బ‌న్నికి జోడీగా ర‌ష్మిక మంద‌న ఎంపికైంది. అయితే ఇందులో ఒక‌రు కాదు ఇద్ద‌రు నాయిక‌లు అని.. స్క్రిప్ట్ డిమాండ్ మేర‌కు మ‌రో భామ‌కు ఛాన్స్ ఉంద‌ని ప్ర‌చారం సాగుతోన్న నేప‌థ్యంలో ఆ ఛాన్స్ నిహారిక‌ను వ‌రించే అవ‌కాశం లేక‌పోలేద‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

మ‌రి ఈ సినిమాలోనైనా నిహారిక‌కు అవ‌కాశం వ‌స్తుందా? ఇవ‌న్నీ గాసిప్పులుగానే మిగిలిపోతాయా? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం నిహారిక వెబ్ సిరీస్ ల‌తో బిజీగా ఉంది. ఇటీవ‌లే మ్యాడ్ హౌస్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. త్వ‌ర‌లో మ‌రో వెబ్ సిరీస్ తో మెప్పించ‌డానికి రెడీ అవుతోంది. మ‌రోవైపు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు నిహారిక‌కు పెళ్లి సంబంధాలు చూస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.