నిహారిక నటనకు దూరం కారణమిదే!

Wed Nov 24 2021 19:00:01 GMT+0530 (IST)

Niharika Konidela In Interview

మెగా డాటర్ నిహారిక - చైతన్య జొన్నలగడ్డ మ్యారీడ్ లైఫ్ సెలబ్రేషన్ గురించి తెలిసిందే. వివాహం తర్వాత నిహారిక పూర్తిగా ప్రయివేట్ లైఫ్ కే ప్రాధాన్యతనిస్తూ మీడియాలో పెద్దగా కనిపించడంలేదు. చాలా రేర్ గా  అవసరమైన సందర్భాల్లోనే కనిపిస్తుంది. ఇటీవలే పుట్టినిల్లు..మెట్టినిల్లుతో  సంబంధం లేకుండా వేరు కాపురం కూడా పెట్టారు. ప్రస్తుతం ఆ ఇంట్లో ఇద్దరే ఉంటున్నారు. భర్త ఉదయాన్ని ఆఫీస్ కి వెళ్లిపోతే ఆ తర్వాత సమయమంతా బోరింగ్!! అంటూ ఇటీవలే నిహారిక తెలిపింది. అయితే పెళ్లి తర్వాత  సినిమాలు కొనసాగిస్తానని.. నటిగా నిర్మాతగా రాణిస్తానని కూడా చెప్పింది.ఇవన్నీ తన భర్తకు ఇష్టం అయితేనే కొనసాగిస్తాను... లేదంటే  చేయనని కూడా ఇంతకుముందు కుండబద్దలు కొట్టింది. అయితే అసలు విషయం నిహారిక ఇప్పుడు రివీల్ చేసింది. చైతన్యకు నిహారిక సినిమాలు చేయడం ఎంత మాత్రం ఇష్టం లేదుట. అదీ నటనా రంగంలో కొనసాగడం అస్సలు ఇష్టం లేదని  తెలిపింది. అందుకే సినిమాలు  చేయడం లేదు. పెళ్లైన తర్వాత హీరోయిన్లు యాక్టింగ్ లో కొనసాగుతున్నారు. సమంత...కాజల్ అగర్వాల్ లాంటి వాళ్లు ఎంతో బ్యాలెన్సింగ్ గా కెరీర్ ని  ముందుకు తీసుకెళ్తున్నారు.  సమంత క్రేజ్  పెళ్లి తర్వాత మరింత పెరిగిందని తెలిపింది. నటనకు దూరంగా ఉంటూ నిర్మాణ రంగంలో మాత్రం కొనసాగుతానని కూడా నిహారిక చెప్పింది.

అలాగేనని నటనని పూర్తిగా వదిలేసినట్లు కాదు. ఓ సూపర్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాను. దాని పూర్తి వివరాలు ఇంకా చెప్పలేను. ఇందులో యూ ట్యూబర్ నిఖిల్ సరసన నటిస్తున్నాను అంది. నిహారిక మాటల్లో  బ్యాలెన్సింగ్ టాస్క్ స్పష్ఠంగా కనిపిస్తోంది. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా తెలివిగా మాట్లాడుతోందని అర్థమవుతోంది. అలాగే నాగబాబు.. చిరంజీవి..పవన్ కళ్యాణ్ లలో ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటే `నాన్న` అని ఆ తర్వాత పెదనాన్ని చిరంజీవి పేరు...అటుపై బాబాయ్ పవన్ కళ్యాణ్ పేర్లు చెప్పింది.