Begin typing your search above and press return to search.

మెగా డాటర్ హగ్ చేసుకున్న యువకుడు ఎవరు...?

By:  Tupaki Desk   |   18 Jun 2020 1:10 PM GMT
మెగా డాటర్ హగ్ చేసుకున్న యువకుడు ఎవరు...?
X
మెగాబ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల వివాహం త్వరలో జరగనుందనే విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇప్పటికే నాగబాబు స్వయంగా వెల్లడించారు. ''నిహారికకు ఈ ఏడాది లేదంటే వచ్చే ఏడాది తప్పకుండా పెళ్లి చేస్తామని.. నిహారిక పెళ్లి తర్వాతే వరుణ్ తేజ్ పెళ్లి చేస్తానని'' చెప్పుకొచ్చాడు. అయితే నిహారిక పెళ్లి త్వరలో జరుగుతుందని అన్నారు కానీ.. సంబంధం కుదిరిందని కానీ నాగబాబు వెల్లడించలేదు. అయితే నిహారిక పెళ్లిపై త్వరలోనే మెగా ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. కాగా నిహారిక సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ద్వారా త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న‌ట్టు చిన్న హింట్ ఇచ్చింది. నిహారిక స్టార్ బక్స్ కాఫీ కప్ మీద 'Ms. Niha' అని రాసి ఉండగా 'Ms.'ని కొట్టేసి 'Mrs.' అని క్వశ్చన్ మార్క్ ( ? ) పెట్టింది. దానికి ''ఉహ్.. వాట్ ?'' అని కామెంట్ జత చేసింది. దీంతో మెగా అభిమానులు నిహారిక పెళ్లిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు జ‌రిపారు. నిహారిక పెళ్లి సెట్ అయిందని హింట్ ఇస్తుందని సోషల్ మీడియా వేదికగా ఆమెకు కంగ్రాట్స్ చెప్పారు. ఈ పోస్ట్‌ కు చిరంజీవి కూతుళ్లు సుస్మిత, శ్రీజ సైతం స్పందిస్తూ.. 'వై' అంటూ నిహారికను ప్రశ్నించారు.

ఇప్పుడు తాజాగా మరో పోస్ట్ పెట్టి తన పెళ్లి విషయాన్ని కంఫర్మ్ చేసింది నిహారిక. తనకి కాబోయే భర్తని హగ్ చేసుకుని ఉన్న ఒక ఫోటో తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో మెగా డాటర్ కి వరుడు దొరికేశాడని అర్థం అయింది. కాకపోతే ఈ ఫొటోలో తనకు కాబోయేవాడి బ్యాక్ సైడ్ ని మాత్రమే చూపించింది. అతని ఫేస్ ని మాత్రం రివీల్ చేయలేదు. ఇక సినీ ప్రముఖులు మెగా అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెప్తున్నారు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ దీనికి స్పందిస్తూ ''గాడ్ బ్లెస్ యూ తల్లి'' అని కామెంట్ పెట్టాడు. హీరోయిన్స్ నిధి అగర్వాల్, లావణ్య త్రిపాఠి కంగ్రాట్స్ చెప్తూ అతని ఫేస్ చూపించమని కోరారు. మొత్తం మీద మెగా డాటర్ పెళ్లిపై ఇన్ని రోజులు వచ్చిన పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టి వరుడిని సెలెక్ట్ చేసుకుంది. పెళ్లి గురించి రోజుకొక హింట్ ఇస్తూ వస్తున్న నిహారిక రేపు ఆమెకు కాబోయే భర్త ఫేస్ చూపిస్తుందేమో అని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. కాగా నిహారిక పెళ్ళి చేసుకోబేయే వ్య‌క్తి గుంటూరుకు చెందిన ఓ గవర్నమెంట్ అధికారి కొడుకు అని.. ప్రకాశం జిల్లా చీరాలకి చెందిన వాడని రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.