మెగా ఫ్యాన్స్ కి షాకిస్తున్న నిహారిక

Mon Nov 18 2019 10:04:26 GMT+0530 (IST)

Niharika Giving Shock To Mega Fans

మెగా ఫ్యామిలీలో వున్నా తనకంటూ ప్రత్యేకత వుండాలని... మహిళా సాధికారత కోసం నిత్యం తపిస్తుంటుంది మెగా డాటర్ నిహారిక కొణిదెల. మెగా ఫ్యామిలీ లో ఇతరుల కంటే భిన్నంగా ఆలోచిస్తూ యాంకర్ గా తన కెరీర్ ని ప్రారంభించిన నిహారిక ఆ తరువాత తెలుగులో వెబ్ సిరీస్ ట్రెండ్ కి నాందీ ప్రస్థావన చేసింది. ఆవకాయ్ ముద్దపప్పు- నాన్న కూచీ వంటి వెబ్ సిరీస్ లతో ఆకట్టుకున్నా సినిమాల్లో మెరవాలని.. కథానాయికగా ఎదగాలని తాను చేయని ప్రయత్నం లేదు.నిర్మాత యం.ఎస్. రాజు కొడుకు సరసన 'హ్యాపీ వెడ్డింగ్' ... నాగశౌర్యతో కలిసి 'ఒక మనసు'.. ఫైట్‌మాస్టర్ విజయ్ తనయుడితో కలిసి 'సూర్యకాంతం' చిత్రాల్లో నటించింది. అయితే తన నటనకు ప్రశంసలు దక్కాయే కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం మాత్రం శూన్యం. దీంతో ఆలోచనలో పడ్డ నిహారిక తనకు అచ్చి వచ్చిన వెబ్ సిరీస్ లనే ఇప్పటికీ నమ్ముకుంది. తాజాగా 'మ్యాడ్ హౌజ్' పేరుతో ఓ వెబ్ సిరీస్ ని నిర్మించింది. అయితే అందులోని తొలి భాగంలో నిహారిక కనిపించలేదు. మొత్తం 100 ఎపిసోడ్ లుగా రానున్న ఈ వెబ్ సిరీస్ లో నిహారిక కూడా కనిపించబోతోందని తెలిసింది.

ఇద్దరు అమ్మాయిలు వుండే ఇంటికి యజమానిగా ఇందులో నిహారిక కనిపించనుందని తాజా సమాచారం. సినిమాల్లో నటించినా ఉపయోగం లేకపోవడంతో సినిమాలని తగ్గించుకుంటూ ఎక్కువ భాగం వెబ్ సిరీస్ లకే టైమ్ కేటాయించాలని నిహారిక నిర్ణయించుకుందట. ఆ విషయాన్ని తండ్రి నాగబాబుతో పాటు పెదనాన్న చిరంజీవికి కూడా వివరించడంతో వాళ్లు కూడా ఓకే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.