తనకి ఎక్కువగా కోపం వస్తే అరిచేస్తాను!

Sun Feb 28 2021 23:00:01 GMT+0530 (IST)

Niharika About Chaitanya

మెగాడాటర్ నిహారిక వివాహం ఎంత ఆడంబరంగా జరిగిందో అందరికీ తెలిసిందే. వివాహానికి ముందు ఆ తర్వాత చాలా రోజులపాటు వీరి పెళ్లి ముచ్చట్లు సోషల్ మీడియాలో కొనసాగాయి. అయితే.. ఈ మధ్య మాత్రం వీరి జాడ బొత్తిగా కనిపించట్లేదు. అయితే.. ఇటీవల వీరిద్దరూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.ఈ సంరద్భంగా చైతన్య మాట్లాడుతూ.. తానూ వరుణ్ తేజ్ క్లాస్ మేట్స్ అని చెప్పాడు. వీరిద్దరూ తొమ్మిదో తరగతిలో కలిసి చదువుకున్నారట. 'మా నాన్న చిరంజీవి అంకుల్ ఫ్రెండ్స్. అలా ఈ సంబంధం కలిసింది' అంటూ తమ పెళ్లి సంబంధం గురించి బయటపెట్టేశాడు చైతన్య. నిహారికను మాత్రం పెళ్లి సందర్భంలోనే కలిశానని చెప్పాడు.

నిహారిక మాట్లాడుతూ.. తాను ఇంట్లో ఎంత కంఫర్ట్‌గా ఉన్నానో అత్తింట్లోనూ అలానే ఉన్నాను అని చెప్పింది. తమ ఇంట్లో కాస్త ఆలస్యంగా లేస్తే తిట్టేవారని కానీ.. అత్తింట్లో మాత్రం నేను పడుకున్నానంటే అసలు డిస్టర్బ్ చేయరని చెప్పింది. అంతేకాదు.. ఆకలి అంటే ముద్దలు కలిపి నోట్లో పెట్టేస్తుంది మా అత్త అంటూ మురిసిపోతోంది మెగా డాటర్.

ఇక భార్యాభర్తల్లో ఎవరికి కోపం ఎక్కువగా వస్తుందనే ప్రశ్నకు మాత్రం నిహారిక వైపే వేలు చూపించాడు చైతన్య. నిహారిక కూడా తన పేరు చెప్పుకుంది. తనకి ఎక్కువగా కోపం వస్తే అరిచేస్తాను అని చెప్పింది. అది ఎలాంటి సందర్భంలోనో కూడా చెప్పేసింది. గదిలో కంఫర్ట్‌గా బెడ్ మీద కూర్చున్నప్పుడు.. లోపలికి డోర్ వేయకుండా వెళ్తుంటాడట చైతన్య. అలాంటప్పుడు కోపంతో అరిచేస్తానని  చెప్పింది నిహారిక. అయితే.. సారీ మాత్రం మొదటగా చైతన్యే చెబుతాడట. మొత్తానికి అత్తారింట్లో.. పుట్టింటిని మించి గారాబం పొందుతోంది నిహారిక.