Begin typing your search above and press return to search.

స్టార్ హీరోల్ని వెంబ‌డిస్తున్న‌ కుర్ర‌బ్యూటీ?

By:  Tupaki Desk   |   16 Jan 2021 9:28 AM GMT
స్టార్ హీరోల్ని వెంబ‌డిస్తున్న‌ కుర్ర‌బ్యూటీ?
X
అక్కినేని నాయిక‌గా ప‌రిచ‌య‌మైనా ఆరంగేట్రం స‌రైన ఫ‌లితం ద‌క్క‌క తీవ్ర నిరాశ‌కు గురైన బ్యూటీ నిధి అగ‌ర్వాల్. వ‌రుస ఫ్లాపుల‌తో డీలాపడిన ఈ అమ్మ‌డు అటుపై రామ్ `ఇస్మార్ట్ శంక‌ర్` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకోగ‌లిగింది. అదే హుషారులో కెరీర్ స్పీడ్ పెంచేస్తుంద‌ని భావించినా ఎందుక‌నో టాలీవుడ్ లో మాత్రం నిధి ఢీలా ప‌డింది.

దీంతో త‌మిళ ప‌రిశ్ర‌మ‌వైపు ఫోక‌స్ మ‌ళ్లించింది. అక్కడ జ‌యం ర‌వి- శింబు లాంటి స్టార్ల సినిమాల్లో న‌టిస్తోంది. అదంతా స‌రే కానీ నిధి అగర్వాల్ ఈ లాక్ డౌన్ స‌మ‌యాన్ని ఎలా స‌ద్వినియోగం చేసింది? అంటే.. వ‌రుస‌గా స్టార్ హీరోల‌ను సామాజిక మాధ్య‌మాల్లో కాకా ప‌డుతూ రెగ్యుల‌ర్ గా ఇన్ స్టాలో పోస్టింగులు పెడుతూ టైమ్ స్పెండ్ చేసింది.

శింబు స‌ర‌స‌న `ఈశ్వ‌ర‌న్`.. జ‌యం ర‌వి స‌ర‌స‌న `భూమి` చిత్రాల్లో న‌టిస్తున్నా ఈ భామ‌కు ఎందుక‌నో తంబీలు అంత ప్రాముఖ్య‌త‌నివ్వ‌లేదు. పోస్ట‌ర్ల‌లోనూ నిధి హ‌వా అస్స‌లు క‌నిపించ‌నే లేదు. దీంతో స‌ద‌రు బ్యూటీ ఏకంగా స్టార్ హీరోల్ని కాకా ప‌ట్టే ప‌నిలో ప‌డింది. శింబు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి స్టా‌ర్ల‌కు విషెస్ తెలిపింది. ఇక విజ‌య్ `మాస్టర్` సినిమాపై అన్ లిమిటెడ్ గా ప్రేమాభిమానం చూపించింది. వాటే ఎన‌ర్జీ మాస్టర్.. గొప్ప ఎంట‌ర్ టైన్ మెంట్ అంటూ ద‌ళ‌ప‌తి విజ‌య్ పైనా పొగ‌డ్త‌లు కురిపించింది. మొత్తానికి నిధి వేట చూస్తుంటే అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించాల‌న్న త‌ప‌న క‌సితో ర‌గిలిపోతోంద‌ని అర్థ‌మ‌వుతోంది. కానీ ఆ ఒక్క ఛాన్స్ అంత తేలిగ్గా వ‌స్తుందా? అన్న‌ది చెప్ప‌లేం.