పవన్ సినిమాతో గ్లామరస్ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా మారుతుందా..?

Wed Jun 09 2021 14:34:20 GMT+0530 (IST)

Nidhi Agarwal Talking About Hari Hara Veera Mallu

'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన గ్లామరస్ నిధి అగర్వాల్ ఇప్పుడు పూర్తిగా సౌత్ ఇండస్ట్రీపైనే ఫోకస్ పెట్టింది. 'మిస్టర్ మజ్ను' సినిమాతో పర్వాలేదనిపించిన నిధి.. 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ రుచి చూసింది. కోలీవుడ్ లో కూడా అడుగుపెట్టిన అందాల గని.. మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ లో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో నటిస్తోంది. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది ఇస్మార్ట్ బ్యూటీ.క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న 'వీరమల్లు' సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందే ఈ చిత్రంలో నటించే అవకాశం వచ్చినందుకు నిధి అగర్వాల్ ఫుల్ ఖుషీ అవుతోంది. క్రిష్ సినిమాలలో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం ఉంటుందనే విషయం తెలిసిందే. క్రిష్ కూడా వారి నుంచి అదే స్థాయిలో నటనను రాబడుతుంటారు. ఇప్పుడు నిధి కూడా దీనికి మినహాయింపు కాదు.

ఇప్పటి వరకు జరిగిన చిత్రీకరణలో నిధి అగర్వాల్ నటన డైరెక్టర్ క్రిష్ ని ఆకట్టుకుందట. అందుకే ఆమెను ఇతర ప్రాజెక్ట్స్ కు రెఫర్ చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. 'వీరమల్లు' సినిమాతో నిధి ఫేట్ మారుతుందని.. స్టార్ హీరోయిన్స్ లిస్టులో జాయిన్ అయిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రం ఇస్మార్ట్ బ్యూటీకి ఎలాంటి ఆఫర్స్ తెచ్చిపెడుతుందో చూడాలి.