పొడుగు హీరో.. పొట్టి పాప సూపర్ జోడీ!

Thu Jan 16 2020 12:52:15 GMT+0530 (IST)

Nidhhi Agerwal TO Romance with Varun Tej

హీరోలకు సరైన జోడీ వెతకడం దర్శకులకు.. నిర్మాతలకు ఓ పెద్ద ఛాలెంజ్.   హీరోలు సాధారణంగా ఉంటే అదేమీ కష్టం కాకపోవచ్చు.   హీరోలు కనుక మరీ పొట్టిగా ఉన్నా.. మరీ పొడవుగా ఉన్నా వారికి సరిపోయే హీరోయిన్లను వెతకడానికి పెద్ద కసరత్తే చేయాల్సి వస్తుంది.  హిందీలో ఆమిర్ ఖాన్ విషయమే తీసుకుంటే పొడవుగా ఉండే హీరోయిన్లు ఆయనకు సూట్ కారు. టాలీవుడ్ లో కూడా ఇలా జోడీలు వెతకడం కష్టమైన హీరోలు ఉన్నారు.  వారిలో వరుణ్ తేజ్ ఒకరు.. వరుణ్ చాలా పొడవు.  ఆయనకు జోడీగా హీరోయిన్లు సెట్ చేయడం కష్టమే.అయితే ఈమధ్య వరుణ్ పొడవుకు తగ్గ పొడవైన హీరోయిన్లను ఎంపిక చేయకుండా హైట్ తక్కువగా ఉన్న భామలనే ఎంచుకుంటున్నారు.  'ఫిదా' లో వరుణ్ తేజ్ కు జోడీగా సాయి పల్లవి నటించింది.  అబ్బాయ్ పొడవు.. అమ్మాయి పొట్టి. అయినా జోడీ అందంగా కుదిరింది.  ఇప్పుడు వరుణ్ తేజ్ కొత్త సినిమాకు కూడా ఇలాంటి జోడీనే సెట్ చేస్తున్నారు.  నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు వరుణ్ సరసన నిధి అగర్వాల్ ను ఎంపిక చేశారని సమాచారం.  టాలీవుడ్ లో ఉండే షార్ట్ హీరోయిన్లలో నిధి ఒకరు. సాయి పల్లవి కంటే నిధి పొడవు తక్కువే.. ఇక వరుణ్ తేజ్ ఎంత పొడవుగా ఉంటాడో తెలిసిందే. అయినా ఈ జోడీ సెట్ చేశారు.

నిజానికి వరుణ్ తేజ్ పక్కన ఎవరిని తీసుకొచ్చినా పొట్టిగానే ఉంటారు. అయితే వరుణ్ - నిధి జోడీ ఇంకా డిఫరెంట్ గా ఉండే అవకాశం ఉంది.  చూస్తుంటే వరుణ్ కు పొట్టి హీరోయిన్లను సెట్ చేసుకోవడం సెంటిమెంట్ గా మారేలా ఉందే.