పవన్ 27 కోసం ఇస్మార్ట్ బ్యూటీ

Thu Nov 26 2020 15:00:50 GMT+0530 (IST)

Ismart Beauty for Pawan 27

పవన్ కళ్యాన్.. క్రిష్ ల కాంబోలో రూపొందబోతున్న మూవీ లో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. మరో హీరోయిన్ పాత్రకు గాను సాయి పల్లవిని పరిశీలించినట్లుగా ప్రచారం జరిగింది. మొదట నో చెప్పిన ఆమె తర్వాత మళ్లీ ఓకే చెప్పిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సమయంలో మరో హీరోయిన్ పేరు కూడా ప్రముఖంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మీడియా వర్గాలు మరియు ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కీలక పాత్ర కోసం ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ను క్రిష్ సంప్రదించాడట. ఈ విషయంలో ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.ఇస్మార్ట్ బ్యూటీ సినిమాతో సక్సెస్ దక్కించుకున్న నిధి అగర్వాల్ ప్రస్తుతం రెండు మూడు తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తోంది. ఇంతగా బిజీగా ఉన్న ఈ అమ్మడికి పవన్ మూవీలో సినిమా ఛాన్స్ వస్తే ఖచ్చితంగా ఆమె కెరీర్ పూర్తిగా మారిపోతుంది అంటున్నారు. పవన్ మూవీలో చిన్న పాత్ర అయినా చేయాలని చాలా మంది హీరోయిన్స్ కోరుకుంటూ ఉంటారు. మరి నిధి అగర్వాల్ కు అంతటి అదృష్టం తలుపు తట్టిందా లేదంటే ఇవన్నీ కూడా మీడియా లో వస్తున్న ఒట్టి పుకార్లేనా అనే విషయం క్లారిటీ రావాలంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.