ఫోటో స్టొరీ: ఇస్మార్ట్ భామ బాలీవుడ్ టచ్

Fri Sep 20 2019 21:33:32 GMT+0530 (IST)

Nidhhi Agerwal Glamourous Pose

హీరోయిన్ గా అవకాశాలు తెచ్చుకోవడమే చాలా కష్టం అనుకుంటారు కానీ అవకాశాలు వచ్చినా కొంతమందికి సక్సెస్ లభించదు.  అయితే కొందరికి మాత్రం రెండు మూడు సినిమాలు అటూ ఇటూ అయినా ఒక హిట్ ను తమ ఖాతాలో వేసుకుంటారు.. కెరీర్ లో పైకి వెళ్ళేందుకు రూట్ క్లియర్ చేసుకుంటారు.  నిధి అగర్వాల్ ఆ కోవకే చెందిన హీరోయిన్. నిధి  అగర్వాల్ 'మున్నా మైఖేల్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తెలుగులో 'సవ్యసాచి'.. 'Mr.మజ్ను' సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచినా 'ఇస్మార్ట్ శంకర్' తో ఓ సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.  ఇస్మార్ట్ విజయంతో నిధి 'ఐరన్ లెగ్' టాగ్ ను తప్పించుకుంది. అందరూ 'ఇస్మార్ట్ శంకర్'  పూరి జగన్నాధ్.. రామ్ లకు డౌన్ లో ఉన్న సమయంలో మంచి బ్రేక్ ఇచ్చిందని అనుకుంటున్నారు కానీ నిధికి కూడా మంచి బ్రేక్ ఇచ్చింది.  ఇప్పుడు నిధికి తెలుగులో మంచి ఆఫర్లే వస్తున్నాయని టాక్ ఉంది.  ఇదిలా ఉంటే రీసెంట్ గా నిధి ఒక సెలూన్ నుంచి బయటకు వస్తూ పేజ్ 3 ఫోటోగ్రాఫర్ల కంటపడింది. అంతే.. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా అందాల నిధిని తమ లేటెస్టు కెమెరాల్లో బంధించారు. బ్లాక్ కలర్ ప్యాంట్ షర్టు ధరించి.. పైనేమో ఒక వైట్ జాకెట్ వేసుకుంది. ఆ ప్యాంట్ షర్టు కొంత పారదర్శకంగా..కొంత సాధారణంగా.. మొత్తంగా గమ్మత్తుగా ఉంది.  ఇస్మార్ట్ బ్యూటీ కావడంతో అందాలను ఏ డోస్ లో వడ్డిస్తే నెటిజన్లు థ్రిల్ అవుతారో ఆ తీరులోనే వడ్డించింది. అంతే కాదు నిజమైన బాలీవుడ్ బ్యూటీ తరహాలో నవ్వుతూ పోజిలిచ్చింది.

ఇక నిధి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే బాలీవుడ్ లో 'మాస్క్'.. 'ఇక్కా' అనే రెండు సినిమాల్లో నటిస్తోంది.  ఈ సినిమాలు కాకుండా తెలుగులో కూడా పలు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయట.  త్వరలోనే నిధి నటించబోయే నెక్స్ట్ టాలీవుడ్ ఫిలిం వివరాలు వెల్లడవుతాయని సమాచారం.