ఇస్మార్ట్ భామకు మాస్ రాజా సినిమా లాభమేనా

Sun Mar 08 2020 14:35:14 GMT+0530 (IST)

Nidhhi Agarwal To Romance with Ravi Teja

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  కోనేరు సత్యనారాయణ నిర్మించనున్న ఈ సినిమాలో రవితేజ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు.రవి తేజ లాంటి సీనియర్ స్టార్ హీరో పక్కన ఇరవైల వయసుండే నిధి హీరోయిన్ గా సూట్ కాదేమోననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే మాస్ రాజా మాత్రం మొదటి నుంచి కొత్త హీరోయిన్లతో నటించేందుకు ఆసక్తి చూపించేవారు. కొన్నేళ్ళ క్రితం రవితేజతో ఎవరైనా కొత్త హీరోయిన్ నటిస్తే వారికి కెరీర్ లో మంచి బ్రేక్ వస్తుందనే సెంటిమెంట్ కూడా ఉండేది. కానీ ఈమధ్య ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రవితేజ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరుస్తూ ఉండడంతో హీరోయిన్లకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదు.  రవి తేజ కు జోడీగా నటించిన హీరోయిన్ల కెరీర్లు నత్తనడకన సాగుతున్నాయి. మరి ఈ ఇస్మార్ట్ భామకు రవితేజ సినిమా తర్వాత అవకాశాలు పెరుగుతాయో లేదో వేచి చూడాలి.

ఇదిలా ఉంటే రవితేజ-నిధి జోడీగా నటించే సినిమా ఓ తమిళ సూపర్ హిట్ సినిమాకు రీమేక్ అని సమాచారం. దర్శకుడు రమేష్ వర్మ ఈమధ్యే రీమేక్ సినిమా 'రాక్షసుడు' తో చక్కని విజయం నమోదు చేశారు. మరి ఈ రీమేక్ కూడా మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చి విజయం సాధిస్తాడా అనేది వేచి చూడాలి.