Begin typing your search above and press return to search.

పొటో టాక్‌ : బాత్‌ టబ్‌ లో ఇస్మార్ట్‌ ఆలోచన ఏంటో?

By:  Tupaki Desk   |   30 Sep 2020 2:30 AM GMT
పొటో టాక్‌ : బాత్‌ టబ్‌ లో ఇస్మార్ట్‌ ఆలోచన ఏంటో?
X
ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌ అందాల ప్రదర్శణ విషయంలో మొహమాట పడదనే విషయం తెల్సిందే. పాత్ర డిమాండ్‌ మేరకు అందాల ప్రదర్శణకు రెడీగా ఉండే ఈ ఇస్మార్ట్‌ బ్యూటీ సోషల్‌ మీడియాలో ఇటీవల షేర్‌ చేసిన ఈ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. బాత్‌ టబ్‌ లో కూర్చుని తీక్షణంగా ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఈమె ఫోజ్‌ ఇచ్చింది. అది ఫొటో షూట్‌ అయ్యి ఉంటుంది. ఎందుకంటే బాత్‌ టబ్‌ లో మామూలుగా అయితే ఫొటోలు తీసుకోరు. కనుక ఆమె ఫొటో షూట్‌ కు బాత్‌ టబ్‌ ను కూడా వదల్లేదా అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఈ ఫొటో మాల్దీవుల్లో సముద్రం పక్కన ఉన్న ఒక రిసార్ట్‌ లో తీసిందిగా తెలుస్తోంది. పాత ఫొటో అయినా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈమద్య థ్రూ బ్యాక్‌ అంటూ ఫొటోలను షేర్‌ చేస్తున్న విషయం తెల్సిందే. అందులో భాగంగానే నిధి అగర్వాల్‌ ఈ ఫొటోను షేర్‌ చేసింది. సవ్యసాచి మరియు మిస్టర్‌ మజ్ను సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు ఇస్మార్ట్‌ శంకర్‌ తో మొదటి హిట్‌ దక్కించుకుంది. ప్రస్తుతం అశోక్‌ గల్లా హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తోంది. అది మాత్రమే కాకుండా ఒక తమిళ ఒక కన్నడ సినిమాను కూడా చేస్తోంది.