ఇదేం దిక్కుమాలిన బర్త్ డే కేక్ నియా

Sat Sep 19 2020 12:30:44 GMT+0530 (IST)

Nia Sharma cuts a Vulgar shaped cake on her birthday

సెలబ్రెటీల బర్త్ డే వేడుకలు చాలా వేడుకగా విభిన్నంగా జరుపుకుంటూ ఉంటారు. బర్త్ డే వేడుకల వల్ల తమకు గుర్తింపు రావాలని భావించే వారు విభిన్నమైన పార్టీలు ఏర్పాటు చేయడం కేక్ లను కట్ చేయడం చేస్తూ ఉంటారు. నటి నియా శర్మ తాజాగా తన పుట్టిన రోజు సందర్బంగా కట్ చేసిన బర్త్ డే కేక్ విమర్శల పాలు అయ్యింది. కేక్ పై పురుషుడి ప్రైవేట్ పార్ట్ ను పెట్టడంతో పాటు వల్గర్ గా ఆ కేక్ కటింగ్ ను కూడా చేయడంతో నెటిజన్స్ ఆమెపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇదేం దిక్కుమాలిన క్రియేటివిటీ అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.30వ బర్త్‌డే సందర్బంగా ప్రత్యేకంగా సెలబ్రేషన్ చేసుకున్న నియా శర్మ అందరి దృష్టి ఆకర్షించాలనుకుందో లేదా మరేంటో కాని అలాంటి కేక్‌తో వేడుక చేసుకుంది. ఆమె స్నేహితులు చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ ఫొటోలు మరియు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మరింత రచ్చ అవుతోంది. ఓ ఇండియన్ నటి ఇలాంటి కేక్ కట్ చేయడంను నెటిజన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు. ఇలాంటి వల్గర్ పనులకు పాల్పడ్డందుకు గాను ఆమెను సినిమాల నుండి బహిష్కరించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు.