హీరోల వల్ల టాలీవుడ్ కు మాంధ్యం ఫీవర్?

Wed Jan 25 2023 08:00:01 GMT+0530 (India Standard Time)

News on Tollywood heros remuneration

ఆర్థిక మాంధ్యం జూన్ నుంచి అన్ని రంగాలని ఓ కుదుపు కుదిపేయనుందని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయినా సరే టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం స్టార్ హీరోల పారితోషికాలు మాత్రం అనకొండల్లా పెరిగిపోతూనే వున్నాయి. స్టార్ హీరోల నుంచి టైర్ టు హీరోల వరకు ప్రతి సినిమాకు భారీగానే డిమాండ్ చేస్తుండటం పలువురిని కలవరానికి గురిచేస్తోంది. ఇదిలా వుంటే గత ఏడాది డిజాస్టర్ ని సొంతం చేసుకున్న ఓ హీరో షాకిచ్చే రెమ్యునరేషన్ ని డిమాండ్ చేస్తున్నాడట.ఓ సినిమాకు ఏకంగా 20 కోట్లు ఇవ్వాల్సిందేనని ప్రొడ్యూసర్స్ ని డిమాండ్ చేస్తున్న తీరు పలువురిని షాక్ కు గురిచేస్తోంది. గత ఏడాది పాన్ ఇండియా మూవీతో భారీ డిజాస్టర్ ని ఎదుర్కొన్నప్పటికీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తాను ఎక్కడా తగ్గేదిలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడట. రీసెంట్ గా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సీనియర్ హీరో కూడా ఇదే పంథాలో వ్యవహరిస్తూ భారీగా డిమాండ్ చేస్తున్నాడని ఒక్కో సినిమాకు తను కూడా పారితోషికం కింద 20 కోట్లు అడుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.  

నిన్న మొన్నటి వరకు 10 నుంచి 12 కోట్లు మాత్రమే తీసుకున్న సదరు సీనియర్ హీరో బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్ లు తన ఖాతాలో చేరడంతో ఇప్పుడు తదుపరి సినిమాల విషయంలో మాత్రం 20 ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆ మొత్తం లేకుంటే సినిమా అంగీకరించడం లేదట. ఓ మోస్తారు సక్సెస్ లని దక్కించుకున్న హీరోలు కూడా ఒక్కో సినిమాకు 20 కోట్లు డిమాండ్ చేస్తున్న తీరు చర్చనీయాంశంగా మారుతోంది.

గత ఏడాది తనదైన మార్కు కామెడీతో ఆకట్టుకున్న హీరో కూడా ఇదే తరహాలో 20 కోట్లు వుంటేనే అంటూ డిమాండ్ చేస్తున్నాడని అంతా వాపోతున్నారు. హీరోల పారితోషికాల కారణంగా సినిమాల బడ్జెట్ లు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఆర్థిక మాంథ్యం ఓ పక్క ఇబ్బందికరంగా మారుతుంటే హీరోలు మాత్రం రెమ్యునరేషన్ లు పెంచేస్తూ నిర్మాతలకు ఇబ్బందికరంగా మారుతున్నారనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.