Begin typing your search above and press return to search.

రవితేజ ఫ్యామిలీ నుంచి కొత్త హీరో?

By:  Tupaki Desk   |   30 Jun 2022 3:30 AM GMT
రవితేజ ఫ్యామిలీ నుంచి కొత్త హీరో?
X
మాస్ మహారాజ రవితేజ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి సపోర్ట్ లేకుండా లైట్ మెన్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ వరకు కొనసాగుతూ ఆ తర్వాత నటుడిగా హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునందుకున్నాడు. ప్రస్తుతం అతను అనుభవిస్తున్న స్టార్ హోదా అంత ఈజీగా వచ్చింది కాదు అనే చెప్పాలి. ఎన్నో కష్టాలు పడి చిత్రపరిశ్రమలో మంచి మార్కెట్ ఉన్న హీరోగా ఎదిగిన రవితేజ తన సన్నిహితులకు కూడా ఏదో ఒక విధంగా సహాయం అందిస్తూనే ఉంటాడు.

చాలామంది కొత్త దర్శకులకు కూడా రవితేజ ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. అయితే తన తమ్ముళ్లు భరత్, రఘు లను కూడా ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చే విధంగా సపోర్ట్ చేశాడు.

అయితే వాళ్ళు ఇద్దరు కూడా అంతగా సక్సెస్ కాలేకపోయారు. ఇక భరత్ అయితే యాక్సిడెంట్ లో మరణించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం రఘు కూడా ఇండస్ట్రీలో పెద్దగా బిజీగా కనిపించడం లేదు. సైలెంట్ గా కొన్ని వ్యాపారాలు చేసుకుంటూ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

అయితే భరత్ చనిపోయిన తర్వాత అతని ఫ్యామిలీ బాధ్యతలను కూడా రవితేజ తీసుకున్నట్లు సమాచారం. అతని కొడుకు మాధవన్ ను హీరోగా పరిచయం చేయించాలి అని రవితేజ గత ఏడాది నుంచి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడట. ఇదివరకే మాధవన్ కు ప్రత్యేకంగా నటనలో శిక్షణ కూడా ఇప్పించినట్లు తెలుస్తోంది.

ఇక రీసెంట్గా రవితేజ ఒక కొత్త యువ దర్శకుడు చెప్పిన ఐడియాకు మెచ్చుకొని పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసిన తర్వాత సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. పూర్తిస్థాయిలో కొత్త నటీనటులతో తెరకెక్కబోయే లవ్ స్టోరీ ద్వారా మాధవన్ వెండితెరకు పరిచయం కాబోతున్నట్లు సమాచారం.

ఎలాంటి హడావిడి లేకుండా ప్రాజెక్టును కూడా మొదలుపెట్టాలని అనుకుంటున్నారట. త్వరలోనే అఫీషియల్ అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది. మరి మాధవన్ ఇండస్ట్రీలో ఎలా క్లిక్ అవుతాడో చూడాలి. మరోవైపు రవితేజ రేజ్ తనయుడు మహాధన్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వస్తోంది.