Begin typing your search above and press return to search.

OTT ని ఊపేసేందుకు కొత్త ట్రెండీ వెబ్ సిరీస్ లు

By:  Tupaki Desk   |   26 July 2021 2:30 PM GMT
OTT ని ఊపేసేందుకు కొత్త ట్రెండీ వెబ్ సిరీస్ లు
X
కరోనా అంతా మార్చేసింది. వినోదం తీరుతెన్నులు మారిపోయాయి. థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమాలు చూడ‌డం పాత ట్రెండ్. ఇప్పుడు అంతా డిజిట‌ల్ లో వీక్ష‌ణ‌కే అల‌వాటు ప‌డ్డారు యువ‌త‌రం.

వెబ్ సిరీస్ లు.. షార్ట్ ఫిలింస్.. డాక్యుమెంట‌రీల‌దే ఇప్పుడు హ‌వా. ఓటీటీ వేదిక‌గా రిలీజ్ అవుతోన్న డిజిట‌ల్ కంటెంట్ ఆద్యంతం ప్రేక్ష‌కుల‌న్ని ఆక‌ట్టుకుంటోంది. గ‌త ఏడ‌ది లాక్ డౌన్ ద‌గ్గ‌ర నుంచి ప్రేక్ష‌కులకు వినోదాన్ని ఇంటింటికి తీసుకెళ్లిన‌ది ఓటీటీలే.. వాటిలో వెబ్ సిరీస్ ల హ‌వా అప్ర‌తిహ‌తంగా కొన‌సాగుతోంది. డైలీ సీరియ‌ల్స్ మాదిరిగా ఒక‌దాని త‌ర్వాత మ‌రొక‌టి ప్రసార‌మ‌వుతూ ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్ టైన్ చేస్తున్నాయి. తాజాగా జూలై 25 నుంచి 31వ తేదీ లోపు ప‌లు వెబ్ సిరీస్ లు...షార్ట్ ఫిలింస్ లు ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఈనెల 24న విద్యాబాల‌న్- శానికా ప‌టేల్- రాజు అర్జున్ న‌టీనటులుగా స‌హాన్ వ్యాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `న‌క్ హాత్` అనే ల‌ఘు చిత్రం రిలీజ్ అయింది. త‌ల్లి కుమారుడికి స్త్రీ- పురుష లింగ స‌మాన‌త్వం గురించి వివ‌రించే కాన్సెప్ట్ ఇది. డైలీ స్కూల్ కి వెళ్లే కుమారుడు స్త్రీల ప‌ట్ల ఎలా ఆక‌ర్షిడితుడ‌వుతున్నాడు? అన్న పాయింట్ ని హైలైట్ చేస్తూ ఈ మూవీని తెర‌కెక్కించారు. ఇది చ‌క్క‌ని సందేశాత్మ‌క లఘు చిత్రంగా ఓటీటీలో లైవ్ అవుతోంది. ఇదే నెల 25వ తేదీన `సుర‌హాత్ కా ట్విస్ట్` అనే మ‌రో షార్ట్ ఫిలిం కూడా రిలీజ్ అయింది. నీనా గుప్తా- చుంకీపాండే- లలిత్ బాల్ న‌టీన‌టులుగా ముగ్గురు ద‌ర్శ‌కులు తెర‌కెక్కించారు. ఆరు షార్ట్ ఫిలింస్ ని క‌లిపి దీన్ని రూపొందించారు. స్క్రీన్ ప్లే బేస్డ్ సాగే ఆస‌క్తిక‌ర ల‌ఘు చిత్ర‌మిది.

ఇక ఈనెల 27న `ల‌వ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ క‌రోనా` అనే మ‌రో షార్ట్ ఫిలిం రిలీజ్ కు రెడీగా ఉంది. దిప్నితా శ‌ర్మ‌.. ఆదిల్ హుస్సేన్- శిభానీ దండేక‌ర్ ప్ర‌ధాన పాత్రల్లో న‌టించారు. ఇంద్రాణీ రాయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. హ్యూమ‌న్ లైఫ్ లో ఎదురయ్యే కొన్ని మ‌ధుర జ్ఞాపకాలు..చేదు అనుభ‌వాల స‌మ్మేళ‌న‌మే ఈ షార్ట్ ఫిలిం కాన్సెప్ట్. ఊహించ‌ని విధంగా క‌రోనా వైర‌స్ చొర‌బ‌డిన త‌ర్వాత మాన‌వ జీవితం ఎలా త‌ల్లికిందులైంద‌న్న అంశాన్ని ఇందులో హైటైట్ గా చూపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే అశుతోష్ రాణా- నీనా గుప్తా-, జితిన్ గులాటీ న‌టీనటులుగా ఆనంది చ‌తుర్వేది ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `చ‌త్ర‌సాల్` జెలై 29న రిలీజ్ అవుతుంది. ఇది గొప్ప చారిత్రాత్మ‌క స్టోరీ. మోఘ‌ల్ సామ్రాజ్యం నుంచి స్వేచ్ఛ‌ను పొందేందుకు చ‌త్ర‌సాల్ రాజు-ఔరంగ‌జేబుతో 1649 లో యుద్ధానికి త‌ల‌ప‌డిన క‌థే ఇది.

`లైన్స్` అనే మ‌రో షార్ట్ ఫిలిం కూడా 29న రిలీజ్ అవుతుంది. హీరా ఖాన్- ఫరీదా జ‌లాల్-, ర‌హ‌త్ ఖాజ్మీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించగా హుస్సేన్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బోర్డ‌ర్ నేప‌థ్యంలో సాగే ల‌వ్ స్టోరీ ఇది. 1999 లో సరిహద్దుల విభ‌జ‌న‌తో వేరైన భార్య భ‌ర్త‌లు చివ‌రికి ఎలా క‌లిసారు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా చూపించ‌బోతున్నారు. అలాగే కృతి స‌న‌న్- పంక‌జ్ త్రిపాటీ- సుప్రియా ఫ‌తాక్ న‌టించిన `మిమి` కూడా జులై 30న రిలీజ్ అవుతుంది. ల‌క్ష్మ‌ణ్ ఉట్టేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన వెబ్ సిరీస్ ఇది. చ‌క్క‌ని కామెడీ డ్రామా నేప‌థ్యంలో సాగుతుంది. అలాగే `సిటీ ఆఫ్ డ్రీమ్స్` సీజ‌న్ -2 ఈనెల 30 నుంచే ప్ర‌సారం కానుంది. ఇక `లీహాఫ్` అనే షార్ట్ ఫిలిం కూడా ఇదే నెల 31న రిలీజ్ అవుతుంది. ఇవ‌న్నీ ఊట్ సెల‌క్ట్,- డిస్నీ హాట్ స్టార్,- నెట్ ప్లిక్స్ , - ఎమ్ ఎక్స్ ప్లేయ‌ర్ లో రిలీజ్ అవుతున్నాయి.