సర్కారు వారి ఖాతాలో మరో రికార్డ్..!

Tue May 17 2022 13:00:01 GMT+0530 (IST)

New Record on Sarkaru Vaari Paata Movie

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''సర్కారు వారి పాట''. భారీ అంచనాల మధ్య గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. మొదటి రోజు మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయినప్పటికీ టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొడుతోంది.'సర్కారు వారి పాట' సినిమా ఐదు రోజులలో ప్రపంచవ్యాప్తంగా రూ. 100 Cr+ షేర్ (100.44 కోట్లు) వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో అత్యంత వేగంగా ఈ మార్క్ ను అందుకున్న ప్రాంతీయ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇది మహేష్ కెరీర్ లో 6వ 100 కోట్ల+ షేర్ సినిమా.. వరుసగా నాలుగవది.

ఒక్క నైజాంలోనే SVP సినిమా 30 కోట్ల షేర్ మార్క్ ను దాటినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ఏరియాలో 30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన మహేష్ బాబు మూడవ చిత్రంగా నిలిచింది. ఇక ఐదవ రోజు నైజాంలో 1.86 కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తోంది. ఓవర్ సీస్ లో 2 మిలియన్ దాలర్లకు పైగా కలెక్ట్ చేసి.. మహేశ్ కెరీర్ లో ఈ మార్క్ అందుకున్న నాలుగవ చిత్రంగా నిలిచింది.

'సర్కారు వారి పాట' సినిమా వరల్డ్ వైడ్ గా ఐదు రోజులకు గానూ 160.2 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని నిర్మాతలు తెలిపారు. వీక్ డేస్ లో డ్రాప్ కనిపించినప్పటికీ.. కొత్త సినిమాల రిలీజులు ఏవీ లేవు కాబట్టి మహేశ్ సినిమా వేసవి సెలవులను క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. మరి రాబోయే రోజుల్లో వసూళ్ళు ఎలా ఉంటాయో చూడాలి.

SVP మేకర్స్ లెక్కల ప్రకారం ఏరియాల వారీగా 5 రోజుల కలెక్షన్స్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
నైజాం - 31.47 కోట్లు
సీడెడ్ - 10.44 కోట్లు
యూఏ - 10.25 కోట్లు
గుంటూరు - 7.85 కోట్లు
తూర్పు - 7.05 కోట్లు
కృష్ణా - 5.76 కోట్లు
వెస్ట్ - 4.65 కోట్లు
నెల్లూరు - 3.12 కోట్లు
మొత్తం AP/TG - 80.59 కోట్లు
కర్ణాటక+ROI - 7.75 కోట్లు
ఓవర్సీస్ - 12.10 కోట్లు
మొత్తం వరల్డ్ వైడ్ షేర్ - 100.44 కోట్లు (షేర్)

'సర్కారు వారి పాట' చిత్రంలో మహేశ్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ఆర్ మది సినిమాటోగ్రఫీ అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ - జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి - 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.