Begin typing your search above and press return to search.

రౌడీకి ఫ్రెంచ్ గాళ్ ఫ్రెండ్ తోడైతే

By:  Tupaki Desk   |   14 Dec 2019 4:47 AM GMT
రౌడీకి ఫ్రెంచ్ గాళ్ ఫ్రెండ్ తోడైతే
X
రౌడీ బ్రాండ్ ఇంటా బ‌య‌టా మార్మోగుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం బాలీవుడ్ లోనూ ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో విజ‌య్ పేరు మార్మోగుతోంది. ఇలాంటి టైమ్ లో దేవ‌ర‌కొండ న‌టిస్తున్న తాజా చిత్రం `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` రిలీజ్ కి రెడీ అవుతోంది. వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. `డియ‌ర్ కామ్రేడ్‌` కొంత నిరాశ‌ను క‌లిగించ‌డంతో ఈ సినిమాపై రౌడీ ఆశ‌ల‌న్నీ ఈ చిత్రంపైనే. ఎలాగైనా ఈ సినిమాతో అభిమాన ప్రేక్ష‌కుల్ని సంతృప్తి ప‌ర‌చాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమా ప్ర‌చారాన్ని కొత్త పంథాలో మొద‌లుపెట్టారు.

ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తో సినిమాపై క్రేజ్ ని క్రియేట్ చేయ‌డంలో నూటికి నూరు శాతం స‌క్సెస్ సాధించాడు. రీసెంట్‌గా ఐశ్వ‌ర్యారాజేష్ స్టిల్ ని రిలీజ్ చేశారు. ఐశ్వ‌ర్యారాజేష్ ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు భార్య‌గా న‌టిస్తున్నారు. తాజాగా మ‌రో హీరోయిన్ కు సంబంధించిన లుక్ ని రిలీజ్ చేశారు. ఇందులో ఇజ‌బెల్లా ఫ్రాన్స్ లో వుండే యువ‌తిగా క‌నిపించ‌నుంది. ఆమెకు.. విజ‌య్ దేవ‌ర‌కొండకు వున్న అనుబంధం ఏంటి? ఫ‌్రెంచి గాళ్ తో క‌లిసి రౌడీ హీరో చేసే ర‌చ్చేంటి అన్న‌ది తెర‌పైన చూడాల్సిందే.

ఐశ్వ‌ర్య‌రాజేష్‌తో వున్న స్టిల్‌లో రాముడు మంచి బాలుడు అన్న‌ట్టుగా క‌నిపించిన విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా రిలీజ్ చేసిన ఇజ‌బెల్లె లెయితేతో వున్న స్టిల్‌లో మాత్రం గెడ్డంతో ర‌గ్గ్‌డ్‌ లుక్ లో క‌నిపిస్తున్నారు. త్వ‌ర‌లో కేథ‌రిన్‌.. రాశిఖన్నా లుక్‌లు రిలీజ్ కానున్నాయి. జ‌న‌వ‌రి 3న టీజ‌ర్‌ విడుద‌ల కానుంది. క్రాంతిమాధ‌వ్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సీనియ‌ర్ నిర్మాత కె.ఎస్‌. రామారావు స‌మ‌ర్ప‌ణ‌లో కె.ఎ. వ‌ల్ల‌భ నిర్మిస్తున్నారు. గోపీసుంద‌ర్ సంగీతం.. జ‌య‌కృష్ణ గుమ్మ‌డి ఫొటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.