సాహో: కొత్త పోస్టర్ వచ్చిందోచ్

Mon May 27 2019 15:17:54 GMT+0530 (IST)

New Poster From Prabhas Saaho Movie

పభాస్ హీరోగా నటిస్తున్న 'సాహో' పై భారీగా అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.  'బాహుబలి' తర్వాత నటించే సినిమా కావడం.. ఇప్పటికే దాదాపు రెండేళ్ళ గ్యాప్ రావడంతో ఆడియన్స్ అందరూ ప్రభాస్ సినిమాకోసం ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టే 'సాహో' ప్రోమోస్ కూడా అంచనాలను మరింతగా పెన్చుతున్నాయి.  కొద్ది రోజుల క్రితం ప్రభాస్ స్వయంగా ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేసి 'సాహో' రిలీజ్ డేట్ ను కన్ఫాం చేసిన సంగతి తెలిసిందే.  తాజాగా 'సాహో' టీమ్ మరో పోస్టర్ తో ప్రేక్షకుల  ముందుకు వచ్చారు.కాసేపటి క్రితం సాహో నిర్మాతలైన యూవీ క్రియేషన్స్ వారు తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ తో పాటుగా "రేస్ ఆన్ లో ఉంది.. కామ్ గా ఉండండి. ఆగష్టు 15 న 'సాహో' ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది" అంటూ ట్వీట్ చేశారు.  పోస్టర్లో ప్రభాస్ స్టైలిష్ జాకెట్.. కళ్ళకు గ్లాసెస్.. చెవికి బ్లూటూత్ ధరించి రయ్యని బైక్ పై దూసుకుపోతున్నాడు. నేపథ్యంలో ఏదో పేలినప్పుడు వచ్చే మంట.. గాలిలో ఎగురుతున్న గాజు ముక్కలు  ఉన్నాయి.  ఓవరాల్ గా పోస్టర్ ను చూస్తుంటే సింపుల్ గా అనిపిస్తోంది కానీ హాలీవుడ్ యాక్షన్ సినిమాల పోస్టర్ల తరహాలో ఉంది.

దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున ఈ సినిమా యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు  శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ కాగా నీల్ నితిన్ ముఖేష్.. జాకీ ష్రాఫ్.. మందిరా బేడీ.. అరుణ్ విజయ్.. ఎవెలిన్ శర్మ.. వెన్నెల కిషోర్.. మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుజీత్ ఈ చిత్రానికి దర్శకుడు.