Begin typing your search above and press return to search.

రాజుగారి ఫ్యామిలీ హీరో మరోటి మొదలు పెట్టాడు

By:  Tupaki Desk   |   6 Dec 2022 11:30 AM GMT
రాజుగారి ఫ్యామిలీ హీరో మరోటి మొదలు పెట్టాడు
X
టాలీవుడ్ దిగ్గజ నిర్మాత దిల్‌ రాజు ఫ్యామిలీకి చెందిన ఆశిష్‌ రౌడీ బాయ్స్ సినిమా తో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెల్సిందే. మొదటి సినిమా తో నటుడిగా ఆశిష్ కు మంచి పేరు దక్కింది. అంతే కాకుండా ఆ సినిమా కూడా మంచి వసూళ్లు నమోదు చేసినట్లుగా ఆ మధ్య దిల్‌ రాజు ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులు పలు సందర్భాల్లో పేర్కొన్నారు.

ఆశిష్ మొదటి సినిమా విడుదల అయ్యి చాలా నెలలు అవుతోంది. ఇప్పటి వరకు తదుపరి సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ లేకపోవడంతే కాస్త గ్యాప్ తీసుకుంటాడా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇంతలోనే ఆశిష్‌ యొక్క రెండవ సినిమా షూటింగ్‌ ను ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది.

సుకుమార్ కాంపౌండ్‌ కు చెందిన కాశీ విశాల్‌ దర్శకత్వంలో ఆశిష్ హీరోగా సినిమా రూపొందబోతోంది. దిల్ రాజు బ్యానర్‌ లో సెల్ఫిష్ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది.

సుకుమార్‌ రైటింగ్స్ బ్యానర్‌ ఈ సినిమాను సమర్పిస్తోంది. ఈ సినిమా లో ఆశిష్ లుక్ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఫస్ట్‌ లుక్‌ తో క్లారిటీ ఇచ్చారు.

ధూల్‌ పేట్‌ ప్రాంతంలో సెల్ఫిష్ యొక్క షూటింగ్‌ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. ఎస్‌ మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమా కోసం చంద్రబోస్‌ సాహిత్యం అందిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలో వెళ్లడిస్తామంటూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ వారు పేర్కొన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.