Begin typing your search above and press return to search.

RGV కి క‌రోనా లేదు నిజ‌మే.. కానీ టెస్ట్ చేశారా?

By:  Tupaki Desk   |   13 Aug 2020 4:30 AM GMT
RGV కి క‌రోనా లేదు నిజ‌మే.. కానీ టెస్ట్ చేశారా?
X
ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వ‌ర్మ వివాదాస్ప‌ద స్టేట్ మెంట్స్ మాత్ర‌మే కాదు.. త‌న‌ను తాను డిపెండ్ చేసుకునే తెలివైన ఎత్తుగ‌డ‌లు వేయ‌గ‌ల‌డు. మొన్న‌టికి మొన్న ఆర్జీవీకి క‌రోనా పాజిటివ్ అంటూ ప్ర‌చార‌మైంది. అయితే ఆ ప్ర‌చారాన్ని తిప్పి కొట్టేందుకు అత‌డు ఎంచుకున్న ఫ‌న్నీ మార్గం అంద‌రినీ న‌వ్వించింది. డంబెల్ ప‌ట్టుకుని బ్రూస్లీ మాదిరి ఎక్స‌ర్ సైజులు చేస్తున్న ఓ వీడియోని ఆర్జీవీ సోష‌ల్ మీడియాల్లో పోస్ట్ చేయ‌డంతో అది కాస్తా వైర‌ల్ గా మారింది. త‌న‌కు క‌రోనా అని వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని ఆర్జీవీ చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

ఏదోలా త‌ప్పించుకునే ప్ర‌య‌త్న‌మే ఇద‌ని అంతా భావించారు. ఒక‌దాని వెంట ఒక‌టిగా ఏటీటీ సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఆర్జీవీ క‌రోనా నుంచి ఎలా త‌ప్పించుకున్నాడు? అన్న‌దే మిస్ట‌రీగా మారింది. అయితే ఇప్ప‌టికీ ఆయ‌న అబ‌ద్ధాన్ని నిజం అని న‌మ్మిస్తున్నాడ‌నే సందేహం అభిమానుల్లో అలానే ఉంది. సినిమా తీయ‌డం అంటే క‌నీసం 20-30 మంది టీమ్ తో అయినా ఇంట‌రాక్ట్ కావాలి. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ఉన్న స‌న్నివేశం దృష్ట్యా ఆర్జీవీకి నిజంగానే పాజిటివ్ కాలేదంటారా? అన్న సందిగ్ధ‌త‌ను ప‌లువురు నెటిజ‌నులు వ్య‌క్తం చేస్తున్నారు.

తాజాగా ఆర్జీవీ శిష్యుడు ఆర్.ఎక్స్ 100 ఫేం అజ‌య్ భూప‌తికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. ఆర్జీవీ కాంపౌండ్ లో తిరుగుతూ ఆర్జీవీ తీసే సినిమాల‌కు సాయ‌ప‌డుతుంటారు భూప‌తి. ఇటీవ‌లే ఆయ‌న ఆర్జీవీని క‌లిసార‌ట‌. అంటే త‌న‌కు పాజిటివ్ అని తెలియ‌క ముందు అలా జ‌రిగింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కాబ‌ట్టి ఇప్పుడు ఆర్జీవీ కూడా టెస్టులు చేయించుకోవాల్సిన టైమ్ వ‌చ్చేసింద‌ని సందేహిస్తున్నారు. అస‌లే ఏది క‌రోనా ఎవ‌రికి వ‌చ్చింది? అన్న‌ది త్వ‌ర‌గా తెలియ‌డం లేదు. అసింప్ట‌మాటిక్ క‌రోనాలో అస‌లే ఏదీ బ‌య‌ట‌ప‌డ‌డం లేదు. మ‌రి ఆర్జీవీ ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోబోతున్నారు? అంటూ ఓ సెక్ష‌న్ సందేహాలు వ్య‌క్తం చేస్తోంది.