త్రిష డిలీట్ చేసిన ట్వీట్.. తన మాజీ లవర్ గురించేనా..?

Tue May 26 2020 22:45:45 GMT+0530 (IST)

Trisha Deleted Tweet..Is it for her ex lover..?

నిజానికి లోకంలో అన్ని బ్రేకప్‌లు గజిబిజిగా.. అర్ధాంతరంగా ముగిసిపోవు. ముఖ్యంగా టెక్నాలజీ ఈరోజుల్లో అందుబాటులో ఉంది కాబట్టి కొందరి సినీ సెలబ్రిటీల బ్రేకప్‌లు ట్వీట్లు.. ముఖం చాటేసుకోవడంతో కూడా ముగుస్తాయి. ఇంకా కొన్ని బ్రేకప్స్ అయితే సోషల్ మీడియాలో ఒకరినొకరు ఘోరంగా.. ధూషించుకోవడంతో ముగుస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరోయిన్ త్రిష పోస్ట్ చేసిన లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ స్టోరీ వైరల్ అవుతోంది. ఎందుకంటే ఆ పోస్ట్ హీరో రానా దగ్గుబాటిని ఉద్దేశించి రహస్యంగా పోస్ట్ చేసినట్లు అనిపిస్తుంది. హీరోయిన్ త్రిష ఆ పోస్ట్‌ను తొలగించింది. కానీ ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు ఊరుకుంటారా.. ఆ పోస్ట్ తో త్రిష రానాలను నెట్టింట చక్కర్లు కొట్టిస్తున్నారు. ఇంతకీ త్రిష ఏమని పోస్ట్ చేసిందంటే.. “మాజీ ప్రియురాలిని బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంచే వ్యక్తులు లోలోపల మధనపడే ప్రేమికులుగా ఉండిపోతారు” అనే విధంగా పోస్ట్ చేసింది.గతంలో రానా త్రిష ఒకరితో ఒకరు డేటింగ్ చేసి.. వారికి తెలిసిన కారణాల వల్ల విడిపోయారు. ఈ విషయం రహస్యం కాదు.. ఎందుకంటే వారిద్దరూ ఇప్పటికి మంచి స్నేహితులుగా ఉన్నారు. ఇటీవలే లాక్డౌన్ సమయంలో త్రిష రానాతో వీడియో కాల్‌లో మాట్లాడిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. దాంతో వారిద్దరూ మంచి స్నేహితులుగా.. సన్నిహితంగా ఉన్నారని అర్ధమవుతుంది. ఇక రానా ఇటీవలే మిహీకా బజాజ్‌తో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఇది జరిగిన కొన్ని రోజుల తరువాత త్రిష నుండి ఈ ట్వీట్ వచ్చింది. ఈ ట్వీట్ ఒకప్పుడు తన ప్రియుడిగా ఉండి.. ఇప్పుడు సన్నిహితంగా ఉన్న రానాను ఉద్దేశించినదిగా కనిపిస్తుంది. ఇక త్రిష డిలీట్ చేసిన ట్వీట్‌ను నెటిజన్లు తెగ విశ్లేషిస్తున్నారు. ఇది తెలిసిన రానా కూడా ఈ వార్త పై స్పందించడు అని సమాచారం.