బెస్ట్ వదిన చేసిన చెత్త పోస్ట్ ఇదేనట!

Wed Apr 24 2019 11:23:53 GMT+0530 (IST)

Netizens fires on Sakshi Singh Instagram post

మిస్టర్ కూల్ ధోని సతీమని సాక్షిసింగ్ తాజాగా ఒక వివాదంలో ఇరుక్కున్నారు. తాజాగా ఆమె పెట్టిన పోస్టుపై పలువురు నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు పెట్టటమే కాదు.. ఇలాంటిది తాము ఊహించలేదని.. అన్ ఫాలో చేస్తున్నట్లుగా తేల్చి చెబుతున్నారు. సరదాగా సాక్షిసింగ్ పెట్టిన ఫోటో.. మిస్ ఫైర్ కావటమే కాదు.. సాక్షి ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా చేసిందంటున్నారు.చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడు మోను కుమార్ తో కలిసి దిగిన ఒక ఫోటోను సాక్షి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. బట్టతల ఉన్న మోను కుమార్ బోడి గుండును ముద్దు పెట్టుకున్న ఫోటోను ఆమె పోస్ట్ చేశారు. బంజరు భూమి.. పచ్చదనం కోసం ఎదురుచూస్తోంది. గడ్డి ఈ సైడ్ పచ్చగా లేదనుకుంటాంటూ రాసిన వ్యాఖ్యపైనా పలువురు మండిపడుతున్నారు.

సాక్షి నుంచి ఇలాంటిది తాను ఊహించలేదని.. మీరు ఇలాంటి పోస్ట్ పెట్టటం తమను బాధించినట్లు కొందరు పేర్కొన్నారు. మరికొందరు ఆమెను ఆన్ ఫాలో చేస్తున్నట్లుగా మెసేజ్ పెట్టారు. గతంలో సాక్షి సింగ్ ను ప్రపంచంలోనే ఉత్తమ వదిన అంటూ మోను కుమార్ పొగడటం తెలిసిందే.

సరదాగా పెట్టిన పోస్ట్.. ఇప్పుడు రివర్స్ కావటమే కాదు.. పలువురు నెటిజన్లు ఆగ్రహం చెందేలా మారింది.  నెగిటివ్ కామెంట్స్ దారిన అవి వస్తుంటే.. మరికొందరు ఈ ఫోటోకు పాజిటివ్ గానూ స్పందించటం గమనార్హం. ఫ్లాట్ పిచ్ బాగుంది.. బ్యాటింగ్ కు పనికొస్తుందంటూ బట్టతలపై సె్టైర్లు వేస్తున్నారు. ప్రముఖులు పబ్లిక్ పోస్టులు పెట్టే ముందు అన్ని కోణాల్లో ఆలోచించి పెట్టకుంటే.. లేనిపోని తలనొప్పులు ఎదురుకావటం ఖాయమన్న నిజాన్ని సాక్షి ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.