Begin typing your search above and press return to search.

`మేడమ్ ముఖ్య‌మంత్రి` మాయావ‌తి బ‌యోపిక్ ?

By:  Tupaki Desk   |   16 Jan 2021 8:30 AM GMT
`మేడమ్ ముఖ్య‌మంత్రి` మాయావ‌తి బ‌యోపిక్ ?
X
మాలీవుడ్ శృంగార నాయిక ష‌కీలా బ‌యోపిక్ లో న‌టించి ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది రిచా చ‌ద్దా. పాయ‌ల్ - బ‌సు ఎపిసోడ్ లో వివాదాల‌తోనూ కావాల్సినంత ప్ర‌చారం తెచ్చుకున్న రిచా ప్ర‌స్తుతం మ‌రో వివాదాస్ప‌ద బ‌యోపిక్ తో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈసారి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి మాయావ‌తిగా రిచా న‌టిస్తోంది.

రిచా చాధా తదుపరి చిత్రం `మేడమ్ ముఖ్యమంత్రి` ట్రైలర్ ఇటీవల విడుదలై ఇప్పటికే హెడ్ లైన్స్ లో కి వ‌చ్చింది. ఉత్తర ప్రదేశ్ లో రాజకీయంగా పెను మార్పు తెచ్చి.. అసమానతలను ధిక్కరించే రాజకీయ నాయకురాలిగా రిచా ఇందులో క‌నిపించ‌నుంది. ఈ కథాంశం కల్పితమైనది అని చెబుతున్నా యుపి మాజీ ముఖ్యమంత్రి .. బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) అధ్యక్షురాలు మాయావతి పాత్ర‌నే ఇది అన్న చ‌ర్చా సాగుతోంది. రిచా క‌ట్టు బొట్టు వేష‌ధార‌ణ ప్ర‌తిదీ మాయావ‌తి లుక్ నే స్ఫురిస్తోంది. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తోనే బోలెడంత వివాదం రాజుకుంది. మేక‌ర్స్ ఒంటెద్దు పోక‌డ‌ల‌తో.. దళితుల కోణంలో మూస చిత్రణకు సిద్ధ‌మ‌య్యార‌ని చాలామంది భావించి విమ‌ర్శిస్తున్నారు.

అయితే ఈ విమ‌ర్శ‌ల్ని రిచా ఖండించారు. ప్రజల మనోభావాలను ఒక‌వేళ కించ‌ప‌రిచిన‌ట్ట‌యితే అందుకు మేం చింతిస్తున్నామ‌ని రిచా అన్నారు. ``మొదటి పోస్టర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఇది కేవలం ఆసరాగా ఒక సన్నివేశంలో మాత్ర‌మే క‌నిపిస్తుంది. చాలా మంది ద‌ళిత ప్ర‌జ‌ల ను స్ఫురించే పాత్ర ఇది. అంద‌రికీ న‌చ్చుతుంది`` అని అన్నారు. పోస్ట‌ర్ ని పొర‌పాటున వేశారు. ఆ త‌ర్వాత మేక‌ర్స్ త‌ప్పును గ్ర‌హించి స‌రిదిద్దుకుని కొత్త పోస్ట‌ర్ ని వేశారు. ఇదంతా అనుకోకుండా జ‌రిగిన‌ది. ఉద్దేశపూర్వక ప్రలోభం కాదు. మమ్మల్ని క్షమించండి. మేం స‌రైన దారిలోనే సినిమా తీశాం. సినిమా చూసినప్పుడు మీరే ఆ విష‌యం చూస్తారు`` అని రిచా అన్నారు.

పితృస్వామ్యం,... కుల అణచివేత.. క్రూరమైన హింసకు వ్య‌తిరేకంగా పోరాడే మహిళ కథ `మేడమ్ ముఖ్యమంత్రి` అని రిచా చ‌ద్దా తెలిపారు. ``మేము ఈ కథను చెప్పడాన్ని ఒక మిషన్ గా భావించాం. ప్రేమను పెంపొందించేందుకు ఈ చిత్రాన్ని రూపొందించాం. తారా అనే మహిళ విచిత్రమైన పితృస్వామ్యం.. కుల అణచివేత.. క్రూరమైన హింసతో పాటు రాజకీయాల విద్రోహులతో పోరాడుతుంది. ఎదగండి.. ఎదిగితేనే మార్పు.. అని చెబుతుంది. ఆమె నమ్మశక్యం కాని ఆత్మ‌గౌరవంతో ధైర్యంతో అలా చేస్తుంది`` అని త‌న పాత్ర గురించి వెల్ల‌డించారు రిచా.

మేడమ్ ముఖ్యమంత్రికి జాలీ ఎల్‌ఎల్ బి ఫేమ్ సుభాష్ కపూర్ దర్శకత్వం వహించారు. 90 లలో సుభాష్ క‌పూర్ పొలిటిక‌ల్ జర్నలిస్టుగా పనిచేశారు. ఆ అనుభ‌వం నుంచే ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రం గత నెలలో థియేటర్లలోకి వచ్చిన షకీలా(రిచా) తరువాత మహమ్మారి భ‌యాల న‌డుమ వ‌స్తున్న‌ రెండవ థియేట్రికల్ రిలీజ్. మేడమ్ ముఖ్యమంత్రి లో సౌరభ్ శుక్లా- మానవ్ కౌల్ - అక్షయ్ ఒబెరాయ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జనవరి 22 న థియేటర్లలో విడుదల అవుతుంది.