ఫైనల్ గా నీకు టీ షర్ట్ ఇచ్చినట్టున్నారే!

Thu Apr 25 2019 14:41:42 GMT+0530 (IST)

Netizens Troll Disha For Wearing a Tee

హీరోయిన్లు చాలామందే ఉంటారు కానీ ఒక్కొకరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందుకే హాట్ అనగానే అందరూ గుర్తురారు. క్యూట్ అనగానే అందరూ గుర్తురారు.  అయితే బికినీ అనగానే గతంలో మెజారిటీ నెటిజనులకు 'లోఫర్' బ్యూటీ దిశా పతాని గుర్తొచ్చేది. దిశా బికినీ హంగామా చూసిన ఒక ఇన్నర్ వేర్ బ్రాండ్ వారు ఆమెను అంబాజిడర్ గా ఎంచుకోవడంతో ఆమె ఇక రెచ్చిపోయింది. ఏ సందర్భం అయినా ఇన్నర్ వేర్లో ఫోటో షూట్లు చేయడం.. సోషల్ మీడియాలో షేర్ చేయడం.. ఇదే పని. అందుకే ఇప్పుడు ఇన్నర్ వేర్ అనగానే దిశా పేరు గుర్తొస్తోంది.అసలే దిశాకు ఇన్స్టాగ్రామ్ లో దాదాపు 20 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. దీంతో దిశా ఎప్పుడు కొత్త ఫోటో పెడుతుందా.. అందాలను ఎంత కొత్తగా వడ్డిస్తుందా అని ఎదురుచూడడం కామన్ అయింది. అయితే ఈమధ్య ఒకసారి రొటీన్ కు భిన్నంగా సదరు ఇన్నర్ వేర్ బ్రాండ్ వారి టీ షర్ట్ తో దర్శనమిచ్చింది.  అసలే భామ షిమ్లా యాపిల్ లాగా ఉంటుంది.. దానికితోడు డార్క్ పింక్ కలర్ టీ షర్ట్ వేసుకోవడంతో మరింత అందంగా అప్సరసలా కనిపించింది.  నెటిజనులు కూడా లైకులతో తమ జేజేలు తెలిపారు.  క్యూట్ అని.. బ్యూటిఫుల్ అని.. తెగ పొగిడారు.

కానీ కొందరు చిలిపి నెటిజనులు మాత్రం దిశాను గట్టిగా తగులుకున్నారు. "మొత్తానికి వాళ్ళు నీకు టీ షర్ట్ ఇచ్చినట్టున్నారే!" అని ఒకరు కామెంట్ చేయగా... "ఎవరైనా టీ షర్ట్ వేసుకోకపోతే సంచలనం నువ్వు వేసుకుంటే సంచలనం" అన్నారు. ఒకరు "అరె.. నువ్వు  బట్టలేసుకుంటే కూడా అందంగానే ఉన్నావు" అని తీర్మానించారు. ఈలెక్కన పాప హాటు ఇమేజ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.