బన్ని X హృతిక్ X కపూర్! బిచ్చగాడిని పోలిందెవరు?

Tue Aug 16 2022 08:00:01 GMT+0530 (IST)

Netizens Say Bwood After Boycott

బన్ని X హృతిక్ X కపూర్! ఇంతకీ బెగ్గర్ ఎవరో కనిపెట్టండి! ప్రస్తుతం ఆన్ లైన్ లో ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ఇది. అసలు ఆ ముగ్గురిలో ఎవరిని పోలి ఉన్నాడు ఈ బిచ్చగాడు? అంటూ ఒక రియల్ బిచ్చగాడి ఫోటోతో నెటిజనులు పోలికలు చూస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.నిజానికి సెలబ్రిటీలు లుక్-ఎ-లైక్ లు చాలా సాధారణం. అలియా భట్ - అమితాబ్ బచ్చన్ - షారూక్- సన్నీలియోన్ సహా ఎందరో సెలబ్రిటీలను పోలి ఉన్న వారిని ఇంతకుముందు చూశాం. దాదాపు ప్రతి నటుడికి దేశంలో లేదా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా డోపెల్ గ్యాంజర్ (డూప్) లు ఉన్నారు. అలాంటి డూప్ ఒకరు ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కనిపించడం అది కాస్తా ఆన్ లైన్ డిబేట్ గా మారడం ఆసక్తిని కలిగిస్తోంది.

ఒకే ఒక్క తేడా ఏమిటంటే.. అతను ఒకరిలా కనిపించడం లేదు.. ఏకంగా ముగ్గురు హీరోలను పోలి ఉన్నాడు. ఆదిత్య రాయ్ కపూర్- హృతిక్ రోషన్ - అల్లు అర్జున్ లను అతడు పోలి కనిపిస్తున్నాడని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ ముగ్గురితో పోలుస్తూ సిగ్నల్ వద్ద స్టైలిష్ మోడల్ లాంటి బిచ్చగాడి ఫోటోగ్రాఫ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు అతను ఎవరిలా కనిపిస్తున్నాడో వ్యాఖ్యానించడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించారు. పలువురు ఆ బిచ్చగాడిని బాలీవుడ్ టాలీవుడ్ స్టార్లతో పోల్చారు.

కవల్జిత్ సింగ్ బేడీ తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ ఫోటోని షేర్ చేసి “ఢిల్లీ బిచ్చగాళ్ళు ” అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ చిత్రంలో బిచ్చగాడు - బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ .. విక్రమ్ వేదలోని హృతిక్ రోషన్ పాత్రను.. పుష్ప పాత్రను పోలి ఉన్నాడు. అతను చేతికి క్రాచెస్ ధరించి ట్రాఫిక్ లో నడుస్తూ వెళుతున్నాడు. నల్లటి టీ-షర్టు గాగుల్స్ ధరించాడు. ఆగస్ట్ 10న ఈ ఫోటోని షేర్ చేయగా అప్పటి నుండి 20K లైక్ లు వచ్చాయి. వేలకొద్దీ వ్యాఖ్యలు రీట్వీట్ లు .. వందల కొద్దీ కోట్ చేసిన ట్వీట్ లు వచ్చాయి. ఆదిత్య రాయ్ కపూర్- విక్రమ్ వేద హృతిక్ రోషన్ -పుష్ప అల్లు అర్జున్ ల పోలికలపై నెటిజన్లు చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

బాలీవుడ్ స్టార్స్ లా కనిపించే ఈ డాషింగ్ బిచ్చగాడి ఫోటోపై వ్యాఖ్యానిస్తూ ఒక నెటిజన్ ఇలా రాశారు. “భాయ్ యే ఆదిత్య రాయ్ కపూర్ భీక్ భీ మంగత హై పార్ట్ మే?” అని రాయగా.. మరొకరు ఇంకో సరదా కామెంట్ ని జోడించారు. “యే అప్నీ రాబోయే చిత్రం మళంగ్ కా సీక్వెల్ పలాంగ్ కి షూటింగ్ కర్ రా హై” హృతిక్ రోషన్ కి మరొక పోలిక ఇదీ అంటూ “ఇది #విక్రమవేధ లుక్ అని నేను అనుకుంటున్నాను.. అతను చాలా పోలి ఉన్నాడు” అని మరొకరు ట్వీట్ చేశారు.

“అతను నెక్ట్స్ పుష్పా అయ్యి ఉండాలి`` అని ఒకరు వ్యాఖ్యానించారు. పుష్ప చిత్రంలో బన్ని పళ్లు తోమే సీన్ వీడియోని షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా హృతిక్- బన్ని- ఆదిత్య రాయ్ లాంటి హీరోలతో ఒక బిచ్చగాడిని పోల్చడం వెబ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇది అరుదైన ఘటనగానే భావించాలి.

``అతను బిచ్చగాడు కాదు.. క్రిప్టో హోడ్లర్`` అని ఒకరు వ్యాఖ్యానించాడు. ``అదే క్రిప్టో క్రాష్ ఇలా చేసింది!`` అని మరొకరు ట్వీట్ చేశారు.. ముంబైలో ఉన్న హిందీ చిత్ర పరిశ్రమను ఎగతాళి చేస్తూ ``బాలీవుడ్ నటులు నిజానికి ఇప్పుడు బహిష్కరణ వేడుక తర్వాత ఇలా మారారు!`` అని రాశారు. ఇంతకీ  ఈ స్టైలిష్ మోడల్ లాంటి బిచ్చగాడు ఎవరిలా కనిపిస్తున్నాడో నెటిజనులే నిర్ణయించాలి.