Begin typing your search above and press return to search.

పోర్న్‌ స్టార్స్‌ తో పోల్చిన నెటిజన్స్‌.. దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన బ్యూటీ

By:  Tupaki Desk   |   9 April 2020 4:30 AM GMT
పోర్న్‌ స్టార్స్‌ తో పోల్చిన నెటిజన్స్‌.. దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన బ్యూటీ
X
సోషల్‌ మీడియాలో సెలబ్రెటీలను టార్గెట్‌ చేసి కామెంట్స్‌ చేయడం ఫ్యాషన్‌ అయ్యింది. కొందరు కావాలని కామెంట్స్‌ చేస్తూ ఉంటారు. మరి కొందరు వారిపై సెలబ్రెటీల దృష్టి పడాలనే ఉద్దేశ్యంతో బ్యాడ్‌ కామెంట్స్‌ చేస్తూ ఉంటారు. సెలబ్రెటీలు ఎక్కువ శాతం అలాంటి బ్యాడ్‌ కామెంట్స్‌ ను పట్టించుకోకుండా వారి పని వారు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కాని కొన్ని సార్లు మాత్రం వారి సహనం కోల్పోయే విధంగా కామెంట్స్‌ ఉంటాయి. దాంతో వాటిపై బరస్ట్‌ అవుతూ ఉంటారు.

తాజాగా తమిళ్‌ బిగ్‌ బాస్‌ బ్యూటీ యషిక ఆనంద్‌ సోషల్‌ మీడియాలో తనపై చేసిన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. తనను పోర్న్‌ స్టార్స్‌ తో పోల్చిన నెటిజన్స్‌ పై తీవ్ర పదజాలంతో రివర్స్‌ పంచ్‌ వేయడంతో పాటు వారు తలదించుకునేలా చేసింది. విజయ్‌ దేవరకొండ నోటా చిత్రంలో కీలక పాత్రలో నటించి పలు తమిళ చిత్రాల్లో కనిపించినా కూడా పెద్దగా గుర్తింపు రాని ఈ అమ్మడికి బిగ్‌ బాస్‌ తో మంచి క్రేజ్‌ వచ్చింది. ప్రస్తుతం తమిళంలో ఈ అమ్మడు క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి ఫాలోవర్స్‌ భారీగానే ఉంటారు.

సోషల్‌ మీడియా ఫాలోవర్స్‌ లో కొందరు ఈమెను అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టేలా కామెంట్స్‌ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఒక వ్యక్తి మీరు ఇండియా యొక్క మియా ఖలీఫా అంటూ కామెంట్‌ చేశాడు. మరో వ్యక్తి మియా ఖలీఫా.. సన్నీలియోన్‌ ను కలిపితే యషిక ఆనంద్‌ అంటూ కామెంట్స్‌ చేశారు. ఆ కామెంట్స్‌ కు యషిక స్పందించింది.

మియా ఖలీఫాలా ఉన్నావు అంటూ కామెంట్స్‌ చేసిన వ్యక్తికి బ్లూ ఫిల్మ్‌ చూసే సమయంలో అప్పుడప్పుడు వారి ఫేస్‌ లు కూడా చూడాలంటూ చురకలంటించింది. మీ యొక్క సోదరితో బ్లూ ఫిల్మ్‌లు తీయవచ్చు కదా అంటూ మరో కామెంట్‌ కు రిప్లై ఇచ్చింది. యషిక కామెంట్స్‌ కు నెటిజన్స్‌ మద్దతు తెలుపుతున్నారు. అలాంటి వారికి ఇలాగే సమాధానం చెప్పాలని అంటున్నారు.