ఇది మరీ అతిగా లేదా థమన్?

Mon Jan 20 2020 16:55:20 GMT+0530 (IST)

Netizens Fires On SS Thaman

సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అల వైకుంఠపురంలో' చిత్రం సూపర్ హిట్ టాక్ ను దక్కించుకుని మంచి వసూళ్లను నమోదు చేస్తున్న విషయం తెల్సిందే. అల్లు అర్జున్ కెరీర్ లో టాప్ మూవీగా నిలిచి పోవడం ఖాయం అయ్యింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా థమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా విషయంలో కీలక పాత్ర థమన్ దే అంటూ బన్నీ మరియు త్రివిక్రమ్ లు నిన్న జరిగిన సక్సెస్ వేడుకలో ప్రకటించిన విషయం తెల్సిందే. అదే సక్సెస్ వేడుకలో థమన్ మాట్లాడుతూ త్రివిక్రమ్ గురించి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.థమన్ మాట్లాడుతూ.. ఈ విజయం కోసం ఆరు నెలలుగా మానసికం గా ఎంతో కష్టపడ్డాం. ఈ ఆల్బం ఇంత బాగా రావడానికి ప్రధాన కారణం అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ గారే. ఈ భూమి మీద త్రివిక్రమ్ గారే అత్యంత కూల్ దర్శకుడు అనేది నా అభిప్రాయం. నేను కెరీర్ ఆరంభించి పదేళ్లు అవుతుంది. ఇన్నేళ్లకు ఆయనతో వర్క్ చేసే అవకాశం దక్కింది. అందుకే పదేళ్లు నిలిచిపోయే పాటను ఇవ్వగలిగాను అన్నాడు.

ఈ భూమి మీదే త్రివిక్రమ్ ను మించిన కూల్ దర్శకుడు ఉండడేమో అంటూ థమన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇన్నాళ్లు నీకు ఆఫర్లు ఇస్తూ వచ్చిన వారిని ఈ మాటలతో అవమానించినట్లే అంటూ ఆగ్రహం వ్యక్తం చేసేవారు కొందరు అయితే మరో సినిమా ఆఫర్ కోసం ఇప్పటి నుండే కాకా పడుతున్నావా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి థమన్ వ్యాఖ్యలు అతి అంటూ నెటిజన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.