Begin typing your search above and press return to search.

అమ్మికి పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. ముద్దులాట ఓ లెక్కా!

By:  Tupaki Desk   |   31 May 2020 1:30 AM GMT
అమ్మికి పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. ముద్దులాట ఓ లెక్కా!
X
అర్జున్ రెడ్డి సినిమాలో ఓ డైలాగ్ ఉంది. 'ఆ పిల్లంటే నాకిష్టం.. కకృతి పడకండి.. తరగతులు పెరిగినకొద్దీ కొత్త అవకాశాలు వస్తూనే ఉంటాయి' అని హీరో పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఆ డైలాగ్ సినీ తారలకే వర్తిస్తుందని చెప్పవచ్చు. కాస్త రివర్స్ ఇక్కడ. జనరల్ గా హీరోలు కక్రుత్తి పడటం చూస్తాం కానీ పెళ్ళికి ముందు హీరోయిన్లు కక్రుత్తి పడటం అరుదు. తరగతులు పెరిగినకొద్దీ అన్నట్లు సినిమా అవకాశాలు వచ్చినా కొద్ది కొందరు హీరోయిన్స్ పోతే దొరకదేమో అన్నట్లు బాయ్ ఫ్రెండ్స్ తో కమిట్ అయి ప్రెగ్నెన్సీ తెచ్చుకొని పిల్లలను కూడా కనేస్తున్నారు. ఇప్పుడా వరుసలో హీరోయిన్ అమీ జాక్సన్ కూడా చేరింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే బాయ్ ఫ్రెండ్ మోడల్, యాక్టర్ జార్జ్‌ పనాయొటోతో లవ్వాయణం నడిపింది. 26ఏళ్లకే పెళ్లి కాకుండా తల్లి అయింది.

ఈ బ్రిటిష్ బ్యూటీ బ్రిటన్ కి చెందిన వ్యక్తిని లవ్ చేసి తన బ్రిటిష్ బుద్ది చూపించింది. ఎందుకంటే చేసేదేమో ఇండియన్ సినిమాలు.. ప్రేమలు పేరంటాలేమో సొంత దేశాలు. అమీ భామ కమిట్ అయి ప్రెగ్నెన్సీ వచ్చాక ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. అప్పటివరకు గుర్తు రాలేదేమో.. పెళ్లి అనేది ఒకటుంది అని. గతేడాది పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. హీరోయిన్గా అమీ జాక్సన్ ఎంత బిజీ ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ ప్రొఫెషనల్ ఫోటోలు వీడియోలు అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే అమీ జాక్సన్-జార్జ్‌ పనాయొటో గతేడాది పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరిగింది.

ఇక తాజాగా అమ్మడు బాయ్ ఫ్రెండ్ జార్జ్ తో రొమాంటిక్ చుంబనంలో మునిగి తేలుతున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాయ్ ఫ్రెండ్ జార్జ్ పై పడుకొని మరీ ముద్దాడుతుంది ఈ ముద్దుగుమ్మ. మాములుగా అందాల ఆరబోతకు ఎందుకు వెనకాడదో ఈ ఫోటో చూస్తే అర్ధమవుతుంది. నాలుగు గోడల మధ్య చేయాల్సిన శృంగారం బాహాటంగా బహిరంగ ప్రదేశాలలో కానిస్తుంది.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో హాయిగా ఫీలవుతుంటే.. మరికొందరేమో ఫైర్ అవుతున్నారు. కానీ పెళ్లి అయినా కాకపోయినా రెచ్చిపోతానంటుంది అమీ జాక్సన్.