నీ వయసెంత అని అమీషాను నిలదీసారు

Fri Jul 23 2021 23:00:01 GMT+0530 (IST)

Ameesha Patel after checking out her latest bikini photos

సెలబ్రిటీలకు సోషల్ మీడియా అనేది ప్రచారానికి మంచి వేదికగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇన్ స్టాగ్రామ్ ఫేస్ బుక్ ట్విటర్ వేదికగా సెలబ్రిటీలు  పాపులారిటీ ని పెంచుకునేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. ముఖ్యంగా ఫేడవుట్ అయిపోయిన హీరోయిన్లు అభిమానులకు రెగ్యులర్ గా టచ్ లో ఉండటానికి ఈ మాధ్యమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. నాటి మేటి కథనాయికలు సైతం తమను మర్చిపోవద్దని అభిమానులకు ఎప్పకప్పు డు గుర్తు చేస్తూనే ఉన్నారు.  తాజాగా బాలీవుడ్ హాట్ గాళ్ అమీషా పటేల్ మరోసారి తనదైన అందచందాలతో హీటెక్కించింది. తరుచూ ఇన్ స్టా వేదికగా అమీషా హాట్ ఫోటోషూట్లతో అభిమానులకు టచ్ లో ఉంటుంది.విదేశీ టూర్లు.. వ్యక్తిగత బెడ్ రూమ్ ఫోటోలను సైతం షేర్ చేసి అటెన్షన్ ని డ్రా చేస్తుంటుంది. తాజాగా మరోసారి టూపీస్ బికీనీలో కుర్రాళ్లలను కవ్వించే ప్రయత్నం చేసింది. రంగు రంగుల టూపీస్ ల్లో... మెరిసిపోతున్న కళ్లద్దాలను ధరించి తెలుపు వర్ణం ఆయిలీ స్కిన్ టోన్ తో సూర్యరశ్మి లో అందాలను ఆరబోస్తూ తళతళలాడిపోతోంది. సాటి వెటరన్లు ఆసూయపడేంత హాట్ లుక్ తో అమీషా జిగేల్ మంటోంది.

నెవ్వర్ బిఫోర్ కిల్లింగ్ లుక్ తో ఓపెన్ పార్క్ ఏరియాల్లోనూ అమ్మడు ఫోటో షూట్లతో మంత్ర ముగ్దులను చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. అమీషా అభిమానులు  కామెంట్లకు అడ్డూ ఆపూ లేకుండా పోయింది. అమీషాలో హాట్ కంటెంట్ ని పొగిడేస్తూ ఘాటైన కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. అన్నట్టు అమీషా ఏజ్ లెస్ బ్యూటీగా చెలరేగిపోతుంటే కొందరు అభిమానులు... నీ వయసెంత అని అమీషాను నిలదీసారు.

ప్రస్తుతం అమీషా  హిందీలో `దేశీ మ్యాజిక్`... `ద గ్రేట్ ఇండియా క్యాసీనో` చిత్రల్లో నటిస్తోంది.` బద్రి` సినిమాతో ఆమె తెలుగులో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత `నాని` లో నటించింది. కానీ టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే అమీషా పటేల్ (45) తొలి నుంచి  బాలీవుడ్ టార్గెట్ గా నే ఎక్కువ సినిమాలు చేసింది. అయితే ఆమె కెరీర్ మిగతా నటీమణులందరి కంటే భిన్నం.  ఏకధాటిగా ఒకేసారి సినిమాలు చేయలేదు. `ఫేం` తో సంబంధం లేకుండా  సెలెక్టివ్ గా గ్యాప్ లు తీసుకుని సినిమాలు చేయడం విశేషం.