నెట్ ఫ్లిక్స్ కి షిఫ్ట్ అయిన నాని..!

Fri Sep 24 2021 08:00:01 GMT+0530 (IST)

Netflix Acquires Shyam Singha Roy movie digital rights

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ''శ్యామ్ సింగ రాయ్''. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో సాయి పల్లవి - కృతి శెట్టి - మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన నాని - సాయి పల్లవి ఫస్ట్ లుక్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో నాని సరికొత్త మేకోవర్ లో కనిపించబోతున్నాడు. చిత్రీకరణ దశలోనే మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా డిజిటల్ రైట్స్ మంచి ధరకు అమ్మడుపోయినట్లు తెలుస్తోంది.ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ ''శ్యామ్ సింగ రాయ్'' సినిమా డిజిటల్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నట్లు సమాచారం. ఇటీవల నాని హీరోగా నటించిన 'వి' 'టక్ జగదీష్' సినిమాల హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్ సినిమా రైట్స్ మాత్రం నెట్ ఫ్లిక్స్ చేతికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది పక్కా థియేటర్లలోనే విడుదల అవుతుందని నాని హామీ ఇస్తున్నారు.

'శ్యామ్ సింగ రాయ్' సినిమా నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతోంది. దీని కోసం భారీ ఖర్చు చేసి స్పెషల్ సెట్స్ ని నిర్మించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత వెంకట్ బోయనపల్లి ఎక్కడా రాజీ పడకుండా గ్రాండ్ స్కేల్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథ అందించారు. మిక్కీ జె.మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. సాను జాన్ వర్గేష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో జిషు సేన్ గుప్తా - రాహుల్ రవీంద్రన్ - మురళీ శర్మ - అభినవ్ గోమటం - లీలా శాంసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.