నాలుగేళ్ల తర్వాత సెల్వరాఘవన్ మూవీ విడుదల.. కంబ్యాక్ చేస్తాడా..??

Sat Mar 06 2021 12:13:53 GMT+0530 (IST)

Nenjam Marappathillai movie Released

తమిళ స్టార్ డైరెక్టర్ సెల్వరాఘవన్ గతకొన్నేళ్లుగా  ప్లాప్ సినిమాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే గతంలోనే విడుదల కాకుండా ఆగిపోయిన సెల్వరాఘవన్ సినిమా.. నెంజమ్ మరప్పతిళ్లై. హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎస్‌జె సూర్య రెజీనా నందిత శ్వేత ప్రధాన పాత్రల్లో నటించారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మార్చ్ 5న ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల నుండి మిశ్రమస్పందన పొందిందని టాక్. ఆర్థిక సమస్యల కారణంగా నెంజమ్ మరప్పతిళ్లై మూవీ నాలుగేళ్లుగా ఆగిపోయింది. అయితే ఇటీవలే నిర్మాతలలో ఒకరైన మదన్(ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్ పిక్చర్స్) పెండింగ్ బకాయిలను చెల్లించి సినిమా విడుదలకు మార్గం సుగమం చేసాడు.అయితే అసలు విడుదల అవుతుందో లేదో.. ఇన్నేళ్లయింది. ఇక సినిమా పై ఆశలు వదులుకోవడం మంచిదని అనుకుంటున్న తరుణంలో సినిమా విడుదల అవ్వడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. నిజానికి రేడియన్స్ మీడియా దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా కొన్నిరోజుల క్రితం మద్రాస్ హైకోర్టు నెంజమ్ మరప్పతిళ్లై విడుదలపై స్టే ఇచ్చింది. పిటిషనర్ అభ్యర్ధనలో ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్ పిక్చర్స్ ఓ సినిమా విషయంలో అప్పుగా తీసుకున్న డబ్బు చెల్లించాల్సి ఉందని చెప్పాడు. ఇన్నేళ్ల బ్రేక్ తర్వాత మదన్ ఆఫ్ ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్ పిక్చర్స్ పెండింగ్ అమౌంట్ చెల్లించి సినిమాకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాడు. ఈ నెంజమ్ మరప్తిలై హర్రర్ థ్రిల్లర్ మూవీ. యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా.. సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితం అవుతోంది. ఇండస్ట్రీ టాక్ మాత్రం సెల్వరాఘవన్ కంబ్యాక్ మూవీ అని వార్తలొస్తున్నాయి. చూడాలి మరి తెలుగులో కూడా డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేస్తారని సమాచారం.