Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : `నేనే వ‌స్తున్నా`

By:  Tupaki Desk   |   29 Sep 2022 6:29 PM GMT
మూవీ రివ్యూ :  `నేనే వ‌స్తున్నా`
X
న‌టీన‌టులు ధ‌నుష్‌, ఇంధుజ ర‌విచంద్ర‌న్‌, ఎల్లిఎవ్ర‌మ్‌, ప్ర‌భు, స‌ల్వ‌రాఘ‌వ‌న్‌, యోగాబాబు, అజీద్ ఖాలీఖ్, శెల్లీ కిషోర్, శ‌ర‌వ‌ణ సుబ్బ‌య్య త‌దిత‌రులు న‌టించారు.
ర‌చ‌న‌ : ధ‌నుష్
సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా
ఛాయాగ్ర‌హ‌ణం : ఓం ప్ర‌కాష్‌
ఎడిటింగ్ : భువ‌న్ శ్రీ‌నివాస‌న్‌
నిర్మాత : క‌లైపులి ఎస్‌. థాను
ద‌ర్శ‌క‌త్వం : సెల్వ‌రాఘ‌వ‌న్‌

ధ‌నుష్ - సెల్వ‌రాఘ‌వ‌న్ ల తొలి కాలయిక‌లో రూపొందిన రొమాంటిక్ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ `కాద‌ల్ కొండేన్‌. త‌మిళంలో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీతో హీరో ధ‌నుష్ న‌టుడిగా మంచి గుర్తింపుని తెచ్చుకోగా అదే స్థాయిలో ద‌ర్శ‌కుడిగా సెల్వ‌రాఘ‌వ‌న్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. ద‌ర్శ‌కుడిగా ఇది అత‌ని తొలి మూవీ. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు అదే త‌ర‌హా క‌థ‌తో సైక‌లాజిక‌ల్ యాక్ష‌న్‌ థ్రిల్ల‌ర్ గా ధ‌నుష్ తో సెల్వ‌రాఘ‌వ‌న్ రూపొందించిన మూవీ `నానే వ‌రువేన్‌`. తెలుగులో ఈ మూవీని `నేనే వ‌స్తున్నా` పేరుతో రిలీజ్ చేశారు. ధ‌నుష్ - సెల్వ‌రాఘ‌వ‌న్ ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన నాలుగువ సినిమా ఇది. గ‌త ఏడాది ఎస్‌. జె. సూర్య, రెజీనాల‌తో హార‌ర్ థ్రిల్ల‌ర్ ని రూపొందించిన సెల్వ‌రాఘ‌వ‌న్ ఈ సారి హార‌ర్ అంశాల‌ని జోడించి సైక‌లాజిక‌ల్ ఐకో పాథ్ గా `నేనే వ‌స్తున్నా` మూవీని రూపొందించాడు. విశేషం ఏంటంటే హీరో ధ‌నుష్ ఈ మూవీకి క‌థ అందించ‌డం. రెండు భాష‌ల్లోనూ ఈ మూవీ ఈ రోజే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.


క‌థ‌:

రామ‌గుండంలోని ఓ ఫ్యామిలీ.. వారికి ప్ర‌భు ధ‌నుష్‌, క‌దీర్ క‌వల పిల్ల‌లు. ప్ర‌భు బుద్ధిమంతుడు.. అయితే క‌దీర్ మాత్రం విచిత్రంగా ప్ర‌వర్తిస్తూ వుంటాడు. ఓ అమ్మాయి డ్రెస్ త‌గ‌ల‌బెట్ట‌డ‌ని అత‌న్ని తండ్రి చెట్టుకి క‌ట్టేసి రాత్రి వ‌ర‌కు అక్క‌డే వ‌దిలేస్తాడు. త‌ల్లి చూడ‌లేక త‌న క‌ట్లు విప్పేయాల‌ని వెళ్లి చేసే స‌రికి క‌దీప్ క‌నిపించ‌డు. ఎక్క‌డో అడ‌విలో ఓ వ్య‌క్తి అత‌న్ని గొలుసుల‌తో బంధించి వేస్తాడు. అత‌న్ని క‌దీర్ అతి కిరాత‌కంగా చంపూయ‌డంతో పోలీసులు ప‌ట్టుకుంటారు. విష‌యం తెలిసిన క‌దీన్ త‌ల్లిదండ్రులు అత‌న్ని పోలీసుల నుంచి విబిపిస్తారు. అప్ప‌టి నుంచి క‌దీర్ వికృత‌చేష్ట‌లు మ‌రీ ఎక్కువ‌వుతాయి.. తండ్రిని క‌దీర్ హ‌త్య చేయ‌డంతో అత‌న్ని వ‌దిలించుకుని త‌ల్లి చిన్న కుమారుడు ప్ర‌భుతో త‌న‌కు దూరంగా వెళ్లిపోతుంది. 20 ఏళ్ల త‌రువాత ప్ర‌భు.. భువ‌న‌ని పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవిస్తుంటాడు.. వీరికి స‌త్య అనే పాపు పుడుతుంది. 12 ఏళ్ల పాప విచిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తూ వుంటుంది. త‌న‌కు సోనూ వేధిస్తున్నాడ‌ని చెబుతుంది. ఇంత‌కీ సోను ఎవ‌రు? .. అత‌నికి ప్ర‌భుకు వున్న సంబంధం ఏంటీ? .. క‌దీర్ ఏమ‌య్యాడు? అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

క‌థ‌నం విశ్లేష‌ణ‌:

సైకో పాథ్ యాక్ష‌న్ థ్రిల్స్ ఇంత వ‌ర‌కు చాలా వ‌చ్చాయి. అయితే ఈ మూవీ ఆత్మ‌లు, సైకో కిల్ల‌ర్ వంటి మిక్సింగ్ స్టోరీతో రూపొందింది. ఆత్మ‌లు వున్నాయ‌ని, అవి ప‌గ, ప్ర‌తీ కారాల కోసం వ‌స్తాయ‌ని చూపిస్తూనే సైకో కిల్ల‌ర్ క‌థ‌ని ఈ సినిమా ద్వారా చూపించారు. చిన్న‌త‌నం నుంచి ఇద్ద‌రు క‌ల‌వ‌ల‌ల్లో ఒక‌రు తేడాగా బిహేవ్ చేయ‌డం వంటి సినిమాలు ఇంత వ‌ర‌కు చాలా వ‌చ్చాయి. ప్రియ‌మ‌ణి న‌టించిన `చారుల‌త‌` ఇదే త‌ర‌హా క‌థ‌తో రూపొందిన థ్రిల్ల‌రే. అయితే ద‌ర్శ‌కుడు తాజాగా ఈ సినిమాలో సైకో థ్రిల్ల‌ర్ తో పాటు హార‌ర్ అంశాల‌ని జోడించి ఆత్మలు సైకోపై రివేంజ్ తీర్చుకోవ‌డం కోసం మళ్లీ త‌న వాళ్ల‌నే ఎంచుకోవ‌డం అంటూ కొత్త క‌థ చెప్పాడు. ఎక్క‌డా లిజిక్ ల‌కు అంద‌కుండా క‌థ‌, క‌థ‌నాలు సాగిన తీరు చాలా రొటీన్ గా,బోరింగ్ గా అనిపిస్తాయి.

ఇంట‌ర్వెల్ ముందు వ‌ర‌కు చైల్డ్ ఎపిసోడ్ ని ఇంట్రెస్టింగ్ న‌డిపి ఏదో ఒక్క క‌థ చెబుతున్నాన‌నే ఫీలింగ్ ని క‌లిగించినా ఆ త‌రువాత క‌థ‌నాన్ని చాలా స్లోగా నీరసంగా సాగించిన తీరు ఆక‌ట్టుకోదు. ఇంట‌ర్వెల్ బ్యాంగ్ లో ఆత్మ‌తో ట్విస్ట్ ఇచ్చిన సెల్వ‌రాఘ‌వ‌న్ ముందు నుంచి క‌బీర్ పాత్ర‌పై ఇచ్చి బిల్డ‌ప్ సెకండ్ హాఫ్ లో ఎక్క‌డా క‌నిపించ‌లేదు.. పెద్ద‌గా చూపించ‌లేక‌పోయాడు కూడా. హార‌ర్ సైకో పాథ్ గా తెర‌కెక్కిన ఈ మూవీలో ధ‌నుష్ రెండు పాత్ర‌ల్లో ద్విపాత్రాభిన‌యంతో ఆక‌ట్టుకున్నాడు.

అయితే త‌ను రాసుకున్న క‌థ‌లో త‌న రెండు పాత్ర‌ల‌కు త‌ప్ప క‌థ‌తో ప‌స లేక‌పోవ‌డం.. ఫ‌స్ట్ హాస్ చాలా స్లోగా సాగిన తీరు పెద్ద‌గా ఆక‌ట్టుకోదు. ఇక సెకండ్ హాఫ్ లో క‌బీర్ పాత్ర‌తో మెరుపులు మెరిపించాడంటే అదీ లేదు. సైకో గా ప్ర‌జెంట్ చేసిన తీరు బాగున్నా అత‌ని పాత్ర‌ని మ‌రింత బ‌లంగా తీర్చి దిద్ది వుంటే బాగుండేది అనిపిస్తుంది. ప్ర‌ధ‌మార్థంలో ఆస‌క్తిని రేకెత్తించినా.. సెకండ్ హాఫ్ కి వ‌చ్చేసే స‌రికి రోటీన్ సైకో థ్రిల్ల‌ర్ గా తేల్చేసి సెల్వ‌రాఘ‌వ‌న్ ప‌స లేని క‌థ‌ని ర‌స‌వ‌త్త‌రంగా న‌డిపించ‌లేక‌పోయాడు. ధ‌నుష్ త‌న ప‌రిథి మేర‌కు ప‌డుతున్న సినిమాని త‌న‌దైన న‌ట‌న‌తో లేపే ప్ర‌య‌త్నం చేశాడు అయితే బ‌ల‌మైన క‌థ‌, అందుకు ఆస‌క్తిని రేకెత్తించే స‌న్నివేశాలు లేక‌పోవ‌డంతో సినిమా బిలో యావ‌రేజ్ గా మిగిలింది.

న‌టీన‌టుల న‌ట‌న‌:

ఇందులో ధ‌నుష్ ద్విపాత్రాభిన‌యం చేశాడు. ప్ర‌భుగా సాఫ్ట్ పాత్ర‌తో పాటు సైకోగా క‌బీర్ పాత్ర‌లో న‌టించాడు. క‌బీర్ పాత్ర‌ల్లో ధ‌నుష్ ట్రాన్స్ ఫ‌ర్మేష‌న్‌, అభిన‌యం ఆక‌ట్టుకుంట‌ది, హ‌త్య చేసే స‌మ‌యంలో క‌బీర్ గా ధ‌నుష్ న‌ట‌న బాగుంది. ఎమోష‌న‌ల్ సీన్ ల‌తో పాటు సైకోగా కృయ‌ల్ గా మారే స‌న్నివేశాల్లో ధ‌నుష్ త‌న‌దైన న‌ట‌న‌తో అద‌ర‌గొట్టాడు. ఇక సాఫ్ట్ పాత్ర అయిన ప్ర‌భు పాత్ర‌లో ఆద్మ ఆవహించి న‌ర‌కం అనుభ‌విస్తున్న త‌న కూతురిని కాపాడ‌లేని నిస్సాహ‌త‌లో వున్న తండ్రిగా భావోద్వేగ స‌న్నివేశాల్లో ధ‌నుష్ ప‌లికించిన హావ భావాలు ఆక‌ట్టుకుంటాయి. ఇక ప్ర‌భు పాత్ర‌కు జోడీగా న‌టించిన ఇంధుజ ర‌విచంద్ర‌న్‌, క‌దీర్ వైఫ్ గా మూగ యువ‌తి పాత్ర‌లో న‌టించిన ఎల్లిఎవ్ర‌మ్‌, ప్ర‌భు, సెల్వ‌రాఘ‌వ‌న్ త‌మ పాత్ర‌ల ప‌రిథి మేర‌కు న‌టించి ఆక‌ట్టుకున్నారు.

మ‌ధ్య మ‌ధ్య‌లో యోగాబాబు న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే సైకియాట్రిస్ట్ పాత్ర‌లో న‌టించిన ప్ర‌భు ని సెల్వ‌రాఘ‌వ‌న్ ఎందుకు తీసుకున్నాడో అత‌నికే తెలియాలి. ప్ర‌భు న‌టించాల్సిన పాత్ర కాదు. అత‌నికి పెద్ద‌గా స్కోపే లేదు. ప్రాముఖ్య‌త కూడా లేదు. లాజిక్ ల‌కు అంద‌ని క‌థ‌తో సెల్వ‌రాఘ‌వ‌న్ మ్యాజిక్ చేయ‌లేక‌పోయాడు.

సాంకేతిక వ‌ర్గం:

ఈ సినిమాకు హీరో ధ‌నుష్ క‌థ అందించాడు. క‌థ‌లోనే పెద్ద క్లారిటీ లేదు. ఆత్మ‌లు అనే పాయింట్ మీద వెళ్లినా క‌థ‌, క‌థ‌నాలు ఒళ్లు గ‌గుర్లు పోడిచే స‌న్నివేశాల‌తో స‌గ‌టు ప్రేక్ష‌కుడిని భ‌య‌పెట్టి కుర్చీకి అతుక్కుపోయేలా చేసేవేమో... కానీ అలా జ‌ర‌గ‌లేదు. ఈ క‌థ‌లో సైకో కిల్ల‌ర్ ని చూపిస్తూనే అత‌న్ని హ‌త్య చేయ‌డానికి మ‌రో బాడీని ఎంచుకునే ఆత్మ క‌థ చెప్ప‌డం ఎక్క‌డా లాజిక్ ల‌కు అంద‌లేదు. ఏదో హాలీవుడ్ క‌థ‌ని తీసుకుని త‌నకు కావాల్సిన విధంగా మ‌లుచుకుని ధ‌నుష్ ఈ కథ‌ని ఎలాంటి లాజిక్ లు లేకుండా రాసుకున్న‌ట్టుగా వుంది. అక్క‌డే పెద్ద మిస్టేక్ జ‌రిగింది. క‌థ‌లో ద‌మ్ము లేక‌పోవ‌డంతో సెల్వ‌రాఘ‌వ‌న్ త‌న మ్యాజిక్ ని చేయ‌లేక‌పోయాడు. త‌న‌దైన టేకింగ్ తో ఆక‌ట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నించినా సరైన క‌థ‌, ఆక‌ట్టుకునే స‌న్నివేశాలు లేక‌పోవ‌డం పెద్ద మైన‌స్ గా మారింది.

ఇక యువ‌న్ శంక‌ర్ రాజా త‌న‌దైన బీజీఎమ్స్ తో ప్రేక్ష‌కుడిని అడుగ‌డుగునా ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసినా స‌రైన స‌న్నివేశాలు లేనికార‌ణంగా అత‌ని ప్ర‌య‌త్నం కూడా వృధానే అయింది.టేకింగ్‌, మేకింగ్ ప‌రంగా ఫ‌రావాలేద‌నిపించినా సినిమా క‌థ‌లో స‌రైన ద‌మ్ము లేక‌పోవ‌డం పెద్ద మైన‌స్ గా మారింది. సైకో థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ మూవీ థ్రిల్ చేస్తుంద‌ని ఊహించిన వారికి తీవ్ర నిరాశే ఎదురైంది. లాజిక్ ల‌క అంద‌కుండా సాగిన ఈ సినిమా అక్క‌డక్క‌డ మెప్పించినా ఓవ‌రాల్ గా మాత్రం ఎలాంటి ఇంపాక్ట్ ని క‌లిగించ‌లేక ఊసూరుమ‌నిపించింది.

చివ‌ర‌గా: `నేనే వ‌స్తున్నా` లాజిక్ ల‌కు అంద‌ని సైకో థ్రిల్ల‌ర్‌

రేటింగ్ 2 /5