ఫోటో స్టోరీ: చిరుత భామిని ఘాటు మోనోకిని

Sat May 30 2020 08:00:07 GMT+0530 (IST)

Photo Story: Chiruth heroine in Monokini

నేహా శర్మ ఎవరని అడిగితే సాధారణ ప్రేక్షకులు కొందరు జవాబు చెప్పలేకపోవచ్చేమో కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం ఓ మిల్లీ సెకన్లో అన్సర్ ఇస్తారు. ఎందుకంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పరిచయం అయిన 'చిరుత' సినిమాలో హీరోయిన్ ఈ భామ. అయితే తెలుగులో పెద్దగా బ్రేక్ రాకపోవడంతో ముంబై ఫ్లైట్ ఎక్కేసింది.అక్కడ కూడా వెంటనే అవకాశాలు రాలేదు కానీ సోషల్ మీడియాను ఫుల్లుగా వాడుకోవడం ఎలా అనే విషయంలో ఈ భామ పీహెచ్డీ చేయడంతో బాలీవుడ్ మహామహులు కూడా నేహను.. నేహ టాలెంట్ ను గుర్తించకతప్పలేదు. ఒకసారి టాలెంట్ ను గుర్తించాక.. కొన్ని ఆఫర్లు ఇచ్చాక నేహ ఆగుతుందా? డోస్ కొంచెం కొంచెం పెంచుతూ ఇన్స్టా ఖాతాలో ఫాలోయర్లను అమాంతం పెంచుకుంది. ఒక రూట్లో మనకు సక్సెస్ వచ్చిందని తెలిసిన తర్వాత అదే రూట్లో ట్రై చేస్తాం కానీ రూటు మార్చి తలబొప్పి కట్టించుకుంటామా.. లేదు కదా. అందుకే నేహ కూడా తనకు గుర్తింపును తీసుకొచ్చిన ఇన్స్టా ను చిన్నచూపు చూడకుండా ఘాటు ఫోటోలతో విరుచుకు పడుతోంది.

ఆ ఘాటు ఉద్యమం కొనసాగిస్తూ తాజాగా ఓ నలుపు రంగు మొనోకిని ధరించి వయ్యారాలు ఒలకబోసింది. ఈ ఫోటోకు ఇచ్చిన క్యాప్షన్ లో మూడు ఎమోజీలు ఉన్నాయి. ఇది పక్కన పెడితే 'ఎందుకంటే గతం అనేది ఇప్పుడు సాధారణం' అనే అర్థం వచ్చేలా ఓ హ్యాష్ టాగ్ ఇచ్చింది. ఈ ఫోటోను.. ఈ ఫోటోలో ఉండే గ్రామర్ ను వివరించాలంటే రెన్ & మార్టిన్ లేదా రేమండ్ మర్ఫీ లాంటి ఆంగ్ల విద్వాంసులు రావాలి. ఎందుకంటే తెలుగువారికి ఈ బికినీలు.. మోనోకినీలు అలవాటు ఉండవు కదా. ఇక స్నేహ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'తైష్' అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది.