Begin typing your search above and press return to search.

టిల్లుగాని ల‌వ‌ర్ టూ హాట్ గురూ

By:  Tupaki Desk   |   9 Aug 2022 4:13 AM GMT
టిల్లుగాని ల‌వ‌ర్ టూ హాట్ గురూ
X
డి.జె.టిల్లు చిత్రంతో బంప‌ర్ హిట్ కొట్టిన క్యూట్ నేహాశెట్టి కి ఇప్పుడు పెద్ద ఆఫర్ లు ఉన్నాయి. వ‌రుస‌గా సంత‌కాలు చేసేందుకు క‌థ‌లు వింటోందని స‌మాచారం. అయితే నేహా ఎడా పెడా తన వైపు వచ్చే ఏ సినిమాలకైనా సంత‌కం చేసేందుకు తొందరపడటం లేదన్న టాక్ ఉంది. క‌థ‌లు పాత్రల విష‌యంలో సెల‌క్టివ్ గా ఉంటోంది. నేహా ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటిలో ఆమె లుక్స్ .. పెర్ఫార్మెన్స్ ప‌రంగా అంతగా ఆకట్టుకుంటోంది. మునుముందు తనని తాను మెరుగుపరుచుకునేందుకు బాగానే క‌స‌ర‌త్తు చేస్తోందని తాజా ఫోటోషూట్ వెల్లడిస్తోంది.

పూరి జగన్నాథ్‌ తెర‌కెక్కించిన‌ మెహబూబా చిత్రంతో తెర‌కు ప‌రిచ‌య‌మైన నేహా శెట్టి సందీప్ కిషన్ నటించిన 'గల్లీ రౌడీ'లోనూ నాయిక‌గా నటించింది. కానీ ఆరంభం ఏవీ క‌లిసి రాలేదు. సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ‌ ప్రధాన పాత్రలో నటించిన డి జె టిల్లు నేహా శెట్టికి తొలి బంప‌ర్ హిట్. ఈ మూవీతో అమ్మ‌డు భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ముఖ్యంగా యువ‌త‌రం హృద‌యాల్ని దోచేసింది ఈ బ్యూటీ.

ఇటీవ‌ల వ‌రుస ఫోటోషూట్ల‌తో అభిమానుల ముందుకు వ‌స్తోంది ఈ బ‌యూటీ. తాజాగా నేహాశెట్టి బోల్డ్ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఎంపిక చేసుకున్న‌ది ట్రెడిష‌న‌ల్ లెహంగా అయినా కానీ అందాల‌ను ఒక రేంజులో ఆర‌బోసింది ఈ కుర్ర‌బ్యూటీ. హాట్ లుక్స్ తో క్యూట్ నేహా శెట్టి క‌ట్టిప‌డేసింది అంటూ ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

బాల్యం నుంచే నట‌రంగంపై మ‌క్కువ పెంచుకున్నాను. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ సినిమాలో డాన్సులు చూసి మ‌రింత‌గా ఇష్టాన్ని పెంచుకున్నాను. చదువు పూర్తయ్యాక మోడలింగ్ చేశాను. మలయాళంలో ముంగారమళై 2 చిత్రంలో నటించాక తెలుగులో పూరీ నుంచి అవ‌కాశం వచ్చింది.

మెహబూబాలో న‌టించాక కొన్నాళ్లు యూఎస్ వెళ్లి అక్కడ న్యూయార్క్ ఫిల్మ్ అకాడ‌మీలో నటనలో కోర్సు నేర్చుకున్నాను. అక్కడి నుంచి వచ్చాక గల్లీ రౌడీ- మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ ల‌ర్‌ చిత్రాల్లో నటించాను. డీజే టిల్లు విజ‌యం సాధించాక వ‌రుస అవ‌కాశాలొస్తున్నాయి అని నేహా తెలిపింది.

బ‌న్నీతో ప్ర‌క‌ట‌న‌లో..ఇటీవ‌ల‌ అల్లు అర్జున్ - నేహా నటించిన జొమాటో ప్ర‌క‌ట‌న‌ టెలివిజన్ లో స్ట్రీమింగ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ జోడీ సినిమా షూటింగ్ లో ఉన్నట్లు ప్రకటనలో చూపించడం ఆస‌క్తిక‌రం. త‌దుపరి బ‌న్ని లాంటి అగ్ర హీరో త‌న సొంత ప్రొడ‌క్ష‌న్ లో నేహాకి అవ‌కాశాలు క‌ల్పించే వీలుంద‌ని ప్ర‌చార‌మైంది.